మెగా కాంపౌండ్‌లో మహేశ్!

x
Highlights

సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్ మహేష్ 27 వ సినిమా మెగా కాంపౌండ్ లో చేయబోతున్నాడు. అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మహేష్...

సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్ మహేష్ 27 వ సినిమా మెగా కాంపౌండ్ లో చేయబోతున్నాడు. అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మహేష్ 27 వ సినిమా స్టార్ట్ కాబోతుందని సమాచారం. ప్రస్తుతం మహేష్ వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో మహార్షి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా అయిన వెంటనే మైత్రి మూవీస్ బ్యానర్ లో సుకుమార్ డైరెక్షన్ లో 26 వ సినిమా చేస్తాడు దీని తర్వాత 27 వ సినిమా మెగా కాంపౌండ్ లో చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ గా క్రిష్ చేస్తాడని తెలుస్తుంది ప్రస్తుతం క్రిష్ ఎన్టీఆర్ బయో పిక్ తీస్తున్నాడు మరి కొన్ని రోజుల్లో ఈ సినిమా కంప్లీట్ అవుతుంది. దీని తర్వాత క్రిష్ చేయబోయే ప్రాజెక్ట్ ఇదే అంటున్నారు మొత్తానికి సూపర్ స్టార్ మహేష్ మెగా కాంపౌండ్‌లో అడుగు పెడుతున్నాడు మరి అల్లు అరవింద్ గీతా గోవిందం లాంటి హిట్ కొట్టిన మెగా కాంపౌండ్ కు మహేష్ ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories