logo
సినిమా

కొత్త షెడ్యూల్ మొదలుపెట్టనున్న 'మహర్షి' టీం

కొత్త షెడ్యూల్ మొదలుపెట్టనున్న మహర్షి టీం
X
Highlights

'భరత్ అనే నేను' సినిమా తో బాక్స్ ఆఫీసు వద్ద సందడి చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'మహర్షి' సినిమాతో...

'భరత్ అనే నేను' సినిమా తో బాక్స్ ఆఫీసు వద్ద సందడి చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'మహర్షి' సినిమాతో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మన ముందుకు రానున్న ఈ సినిమా మహేష్ బాబు కరియర్ లో 25వ సినిమా గా తెరకెక్కనుంది. ఇప్పటికే కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పల్లెటూరు సెట్లో షూటింగ్ పూర్తిచేసుకుంటోంది. ఈ పల్లెటూరి సెట్ కోసం ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టారు అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ షెడ్యూల్ ఆదివారం తో పూర్తి కానుంది.

అది పూర్తయిన వెంటనే చిత్రబృందం తమిళనాడులోని పొల్లాచ్చిలో షూటింగ్ మొదలు పెట్టనుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వినీదత్ మరియు పీవీపీ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తారీఖున ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. 'భరత్ అనే నేను' సూపర్ హిట్ అవడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు కొత్త లుక్ లో కనిపించనున్నారు. మరి ఈ సినిమాతో మహేష్ బాబు తన ఖాతాలో మరో హిట్ ను నమోదు చేసుకుంటాడు లేదో వేచి చూడాలి.

Next Story