logo
జాతీయం

మహారాష్ట్ర ఏటీఎస్‌ మాజీ చీఫ్‌ ఆత్మహత్య

మహారాష్ట్ర ఏటీఎస్‌ మాజీ చీఫ్‌ ఆత్మహత్య
X
Highlights

మహారాష్ట్ర యాంటీ టెర్రర్ స్క్వాడ్ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి హిమాన్షు రాయ్ ఆత్మహత్య చేసుకున్నారు. అడిషనల్...

మహారాష్ట్ర యాంటీ టెర్రర్ స్క్వాడ్ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి హిమాన్షు రాయ్ ఆత్మహత్య చేసుకున్నారు. అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా పనిచేసిన హిమాన్షు రాయ్.... తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్నారు. రెండేళ్లుగా బోన్‌ కేన్సర్‌తో బాధపడుతోన్న హిమాన్సు..... మానసిక ఒత్తిడితోనే సూసైడ్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. 1998 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన హిమాన్షు రాయ్.... 2013 ఐపీఎల్ స్పాట్-ఫిక్సింగ్ దర్యాప్తులో కీలక పాత్ర పోషించారు. అలాగే దావూద్ సోదరుడు ఇక్బాల్ డ్రైవర్ ఆరిఫ్ కాల్పుల కేసు, జర్నలిస్ట్ జడే హత్య కేసు, లైలా ఖాన్ జంట హత్యల కేసులను పరిష్కరించడంలో రాయ్ కీలక పాత్ర పోషించారు.

Next Story