మిగిలినవి.. మూడే...కూటమి పొత్తులో ...

x
Highlights

కూటమి రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. పొత్తు పేరుతో సీట్లు పంచుకునేందుకు సిద్ధమైనా సర్దుబాట్ల పేర్లతో చర్చల మీద చర్చలు జరిపారు. చివరకు ఫ్రెండ్లీ...

కూటమి రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. పొత్తు పేరుతో సీట్లు పంచుకునేందుకు సిద్ధమైనా సర్దుబాట్ల పేర్లతో చర్చల మీద చర్చలు జరిపారు. చివరకు ఫ్రెండ్లీ కాంటెస్ట్‌ పేరుతో మిత్రులకు కేటాయించిన సీట్లలోనే కయ్యానికి కాలుదువ్వారు. ముందు అనుకున్న పొత్తుల ప్రకారం కాంగ్రెస్‌ 94, టీడీపీ 14, టీజేఎస్‌ 8, సీపీఐ 3 స్థానాల్లో పోటీకి సిద్ధపడ్డాయి. అయితే చివరి నిముషంలో సీన్‌ కంప్లీట్‌గా రివర్స్‌ అయ్యింది. జనసమితిని అడ్డంగా బుక్‌ చేసింది కాంగ్రెస్‌. కేటాయించిన 8 స్థానాల్లో ఐదింట్లో పోటీకి నామినేషన్ వేసింది. దీంతో జనసమితి పోటీ చేసేది కేవలం 3 స్థానాల్లోనే.

మొత్తానికి టీజేఎస్‌కు మిగిలినవి కేవలం 3 సీట్లే అన్నమాట. మిర్యాలగూడ, వరంగల్‌ ఈస్ట్‌, దుబ్బాక, మెదక్‌, అంబర్‌పేట్‌ స్థానాల్లో కాంగ్రెస్‌ తమ అభ్యర్థులకు బీ ఫామ్స్‌ ఇవ్వడంతో ఆయా స్థానాల్లో కాంగ్రెస్‌, టీజేఎస్‌ మధ్య పోటీ నెలకొంది. అలాగే కాంగ్రెస్‌ పోటీ చేస్తున్న ఆసిఫాబాద్‌, ఖానాపూర్, చెన్నూర్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌లలో జనసమితి తమ అభ్యర్థులకు బీ ఫామ్స్‌ ఇచ్చింది. అంతేకాకుండా టీడీపీకి కేటాయించిన మహబూబ్‌నగర్‌, అశ్వారావుపేటల్లోనూ టీజేఎస్‌ తమ అభ్యర్థులకు బరిలోకి దింపింది. దీంతో టీజేఎస్ మొత్తంగా 14 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక కాంగ్రెస్‌ మాత్రం సెంచరీ కొట్టింది. వంద స్థానాల్లో అభ్యర్థులకు బీ ఫామ్స్‌ అందజేసింది.

రోజుల తరబడి చర్చలు జరిపారు సిట్టింగుల మీద సిట్టింగులు వేశారు ఢిల్లీ నుంచి గల్లీ దాకా చర్చోపచర్చలు జరిపారు. స్క్రీనింగ్‌ కమిటీ ఎలక్షన్‌ కమిటీల ముందు చివరి క్షణం వరకు అభ్యర్థుల ప్రకటనలో తలమునకలయ్యారు. ఎట్‌ లాస్ట్‌ రాహుల్‌తోనూ తీవ్ర చర్చలు జరిపారు. అయినా 11 స్థానాల్లో పొత్తు పార్టీలే కత్తులు దూసుకుంటున్నాయి. ఇంతటి భారీ సీన్‌లో కోదండరామ్‌ పార్టీ మూడంటే మూడు స్థానాల్లో పోటీ చేయడం ఆ పార్టీ నాయకులనే తీవ్ర అసంతృప్తికి గురి చేస్తోంది. అధికారంలోకి వస్తే డిప్యూటీ సీఎం అన్నారు మహాకూటమికి కన్వీనర్‌ అన్నారు అన్నీ చేసిన కాంగ్రెస్‌ కోదండరామ్‌కు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చిందా అనే వాదన వినిపిస్తుంది.

ఫ్రెండ్లీ పోటీ అయినా సాధారణ పోటీ అయినా బరిలోకి దిగితే జరిగేది రణమే. అలాంటి పరిస్థితులున్న చోట స్నేహపూర్వక పోటీ అని చెబుతూ మాటలు దాట వేస్తున్నారు. ఇక నామినేషన్ల ఉపసంహరణ గడువు ఎల్లుండి వరకు ఉండటంతో ఆ తర్వాతే మహాకూటమి అభ్యర్థుల లిస్టు ఫైనల్‌ అవుతుంది. దీంతో అప్పటివరకు సమయం ఉండటంతో కాంగ్రెస్‌, టీజేఎస్‌ ల నుంచి కొందరు అభ్యర్థులు వెనక్కి తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories