తమిళనాడు సీఎంకు మద్రాసు హైకోర్టు ఊహించని షాక్...!

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి మద్రాసు హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ...
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి మద్రాసు హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు జారీచేసింది. ఎస్పీ ర్యాంకు అధికారి నేతృత్వంలో సీబీఐ విచారణకు ఆదేశిస్తూ జస్టిస్ జగదీశ్ ఇవాళ తీర్పు వెలువరించారు. పారదర్శక విచారణ కోసమే ఈ కేసును సీబీఐకి అప్పగించామన్న ధర్మాసనం మూడు నెలల్లోగా ప్రాథమిక విచారణ పూర్తి చేయాలని గడువు విధించింది. హైవే ప్రాజెక్టుల కేటాయింపులో పళనిస్వామి అవినీతి పాల్పడ్డారంటూ ప్రతిపక్ష డీఎంకే ఫిర్యాదు చేసిన నాలుగు నెలల తర్వాత హైకోర్టు ఈమేరకు స్పందించింది.
తాజా ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఇద్దరు మంత్రులు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఆరోగ్యమంత్రి సి. విజయభాస్కర్ సీబీఐ విచారణ ఎదుర్కోనున్నారు. సీఎం పళనిస్వామి తన బంధువులకు చెందిన పలు కంపెనీలకు ఐదు హైవే ప్రాజెక్టులను కట్టబెట్టి భారీ అవినీతికి పాల్పడ్డారంటూ ఈ ఏడాది జూన్‌లో డీఎంకే పార్టీ డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్‌కి ఫిర్యాదు చేసింది. డీవీఏసీ స్పందనపై సంతప్తి చెందని ఆ పార్టీ ఆగస్టు నెలలో మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది.
Bandi Sanjay: డీజీపీకి డెడ్‌లైన్ విధించిన బండి సంజయ్
15 Aug 2022 9:19 AM GMTతెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన కే.కేశవరావు
15 Aug 2022 8:15 AM GMTగోల్కొండ కోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
15 Aug 2022 6:33 AM GMTచిరంజీవి బ్లడ్ బ్యాంకులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 6:17 AM GMTమంగళగిరిలోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 4:49 AM GMT75th Independence Day: తెలంగాణలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 2:52 AM GMTFreedom Rally: పోలీసుల తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
13 Aug 2022 10:37 AM GMT
వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్న సీఎల్పీ బృందం
16 Aug 2022 4:06 AM GMTనంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం
16 Aug 2022 3:51 AM GMTరిషి సునాక్ కు వ్యతిరేక పవనాలు
16 Aug 2022 3:34 AM GMTఇవాళ రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం
16 Aug 2022 3:09 AM GMTనేడు అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ పర్యటన .. ఏటీసీ టైర్స్ ప్రారంభం
16 Aug 2022 2:28 AM GMT