శ్రీరెడ్డి గెలుపు.. దిగొచ్చిన ‘మా’ అసోసియేషన్..

మొత్తానికి శ్రీరెడ్డి విషయంపై మా అసోసియేషన్ దిగొచ్చింది. ఆమెపై విధించిన నిషేదాన్ని ఎత్తివేసింది. గురువారం...
మొత్తానికి శ్రీరెడ్డి విషయంపై మా అసోసియేషన్ దిగొచ్చింది. ఆమెపై విధించిన నిషేదాన్ని ఎత్తివేసింది. గురువారం సాయంత్రం ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి ఈ మేరకు నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ ప్రెస్ మీట్ లో మా అధ్యక్షుడు శివాజీరాజా, నటులు నరేష్, జెమిని కిరణ్, భరద్వాజ, డైరెక్టర్ శంకర్ పాల్గొన్నారు. ఆరోజున ఆమె చేసిన పని కారణంగా ఆవేశంతో అలా మాట్లాడమన్న మా అధ్యక్షుడు.. ఆమెను తమలోకి ఆహ్వానిస్తున్నట్లు చెప్పాడు. 'మా లాగే ఎంతో మంది ఈ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని మంచి పేరు తెచ్చుకోవాలని.. రెండు రాష్ట్రాల నుంచి చాలా మంది వస్తారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది అవకాశాలు ఇప్పించలేదు. దర్శకులు.. నిర్మాతలు ఛాన్సులు ఇస్తారు.. మేం తెలుగు వాళ్లకు ముఖ్యంగా సీనియర్లకు అవకాశాలు ఇప్పించమని చెప్పాం. నేను.. నరేష్.. శ్రీకాంత్ వంటి అందరికీ ఛాన్సులు ఇప్పించాల్సిన బాధ్యత ఉంది' అన్నాడు శివాజీ రాజా.
'తేజ గారు ఫోన్ చేసి.. రెండు ఛాన్సులు శ్రీరెడ్డి గారికి ఇస్తాను అంటే.. మీరు ఇవ్వండి ఆవిడ మా కుటుంబంలో ఓ వ్యక్తి.. చిన్న తప్పు చేసింది కదా అని పగలు పెట్టుకోము. మా ఆర్టిస్టు ఇలా చేసిందని బాధ పడిన మాట నిజం. మా పెద్దలు ఇవాళ మాతో మాట్లాడుతూ.. 900 మంది ఆమెతో నటించకూడదు అన్న మాటను వెనక్కు తీసుకోమని చెప్పినప్పుడు సంతోషించాం. ఆమె ఫిలిం ఇండస్ట్రీపై కాన్సంట్రేట్ చేయాలని.. మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. నన్ను అన్నయ్యా అనుకో.. నా దగ్గరకు వచ్చి వట్టి చేతులతో ఎవరూ వెళ్లలేదు. ఏ సహాయం కావాలన్నా చేస్తానని చెప్పాను' అన్నాడు శివాజీ రాజా.
'శ్రీరెడ్డి గారూ.. రామ్మా.. మాలో కలువు.. మీతో మేమందరం కలిసి యాక్ట్ చేస్తాం' అంటూ తన స్పీచ్ కు ఫినిషింగ్ ఇచ్చాడు శివాజీ రాజా. మా సభ్యత్వం ఆమెకు ఇచ్చే విషయంలో నిబంధనలకు అనుగుణంగానే అన్నీ జరుగుతాయని చెప్పాడు.
పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT
రేవంత్ 'రెడ్డి' పాలిటిక్స్ తిరగబడ్డాయా?
24 May 2022 4:00 PM GMTHealth: ఈ ఆహారాలు కాలేయానికి హానికరం.. అస్సలు తినొద్దు..!
24 May 2022 3:30 PM GMTప్రేమ వివాహం.. అక్కను పెళ్లి చేసుకున్నాడని బావ చెవి కొరికేసిన...
24 May 2022 3:10 PM GMTకుమారుడి కోసం ఒక్కటైన పవన్, రేణు దేశాయ్.. ?
24 May 2022 3:00 PM GMTFenugreek Seeds: పెళ్లైన పురుషులు కచ్చితంగా మెంతులని తినాలి.....
24 May 2022 2:45 PM GMT