Top
logo

కంటతడి పెట్టిన సుమిత్రా మహాజన్

కంటతడి పెట్టిన సుమిత్రా మహాజన్
X
Highlights

లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ(89) మృతిపట్ల లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం...

లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ(89) మృతిపట్ల లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఛటర్జీ తనకు పెద్దన్న లాంటి వ్యక్తి అని చెబుతూ సుమిత్రా మహాజన్ కన్నీరు పెట్టుకున్నారు. 1989లో తాను పార్లమెంటులో అడుగుపెట్టినప్పటి నుంచి ఆయన ఎంతగానో గుర్తుండిపోయారని అన్నారు. సభలో నిబంధనలు పాటించడం దగ్గర నుంచి, ఆయన లెవనెత్తే ప్రశ్నలు వరకూ తాను నిశితంగా పరిశీలించే దానిననీ, స్పీకర్‌గా ఆయన హయాం తనకు మార్గదర్శకమైందని సుమిత్రా మహాజన్ అన్నారు. తమ ఇద్దరి భావజాలాలు వేరు అయినప్పటికీ.. తాను ఛటర్జీని అన్నగా భావించే దానిని స్పీకర్ తెలిపారు.

Next Story