logo
జాతీయం

లోక్‌సభ : అవిశ్వాస తీర్మానంపై చర్చకు అనుమతించిన స్పీకర్‌ మహాజన్‌

లోక్‌సభ : అవిశ్వాస తీర్మానంపై చర్చకు అనుమతించిన స్పీకర్‌ మహాజన్‌
X
Highlights

కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ఎంపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం అందిందని లోక్ సభ స్పీకర్ సుమిత్రామహాజన్ తెలిపారు....

కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ఎంపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం అందిందని లోక్ సభ స్పీకర్ సుమిత్రామహాజన్ తెలిపారు. టీడీపీ సహా పలు పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలు అందాయని చెప్పారు. అవిశ్వాసంపై చర్చకు సంబంధించిన తేదీ, సమయాన్ని 10 రోజుల్లో ప్రకటిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా అవిశ్వాసానికి ఎంతమంది ఎంపీలు మద్దతు పలుకుతున్నారని స్పీకర్ ప్రశ్నించగా... టీడీపీ, కాంగ్రెస్ సహా పలు విపక్ష సభ్యులు లేచి నిలబడ్డారు. నిలబడ్డవారి సంఖ్య 50కి పైగా ఉండటంతో, అవిశ్వాసంపై చర్చ జరుపుతామని తెలిపారు. నియమనిబంధనలను అనుసరించి, చర్చను చేపడదామని చెప్పారు.

Next Story