logo
సినిమా

మునుపెన్నడూ చెయ్యని కాన్సెప్ట్ తో ఎన్టీఆర్

మునుపెన్నడూ చెయ్యని కాన్సెప్ట్ తో ఎన్టీఆర్
X
Highlights

బాహుబలి, మగధీర మరియు యమదొంగ కలిస్తే ఏమవుతుంది అంటే 'ఆర్ఆర్ఆర్' సినిమా అవుతుంది అని చెప్పుకోవచ్చు. రామ్ చరణ్,...

బాహుబలి, మగధీర మరియు యమదొంగ కలిస్తే ఏమవుతుంది అంటే 'ఆర్ఆర్ఆర్' సినిమా అవుతుంది అని చెప్పుకోవచ్చు. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి అని తెలిసిందే. ఈ సినిమా కథ ఎలా ఉండబోతోంది? సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రలు ఎలా ఉండబోతున్నాయి? అసలు సినిమా కాన్సెప్ట్ ఏంటి? అనే వాటిపై ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే ఈమధ్య సోషల్ మీడియాలో సినిమా కాన్సెప్ట్ పై ఒక ఆసక్తికర చర్చ కోనసాగుతోంది.

'ఆర్ ఆర్ ఆర్' సినిమా గతజన్మల నేపథ్యంలో తెరకెక్కనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే గత జన్మల నేపథ్యంలో రాజమౌళి 'మగధీర' సినిమాకి దర్శకత్వం వహించారు. ఆ సినిమా లో రామ్ చరణ్ హీరో. కాబట్టి వీరిద్దరికి గత జన్మ నేపథ్యంలో సినిమా కొత్త కాదు. కానీ ఎన్టీఆర్ ఇప్పటిదాకా ఇలాంటి పాత్ర చేయలేదు కాబట్టి ఫాన్స్ కూడా చాలా ఆసక్తికరంగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మనం 2020 వరకు ఆగాల్సిందే. ఈ సినిమాలో హీరోయిన్ లు మరియు ఇతర పాత్రల విషయాలపై త్వరలో క్లారిటీ రానుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

Next Story