Top
logo

పోలీసులపై లగడపాటి ఆగ్రహం...వారెంట్‌ లేకుండా ఇంటికెలా వస్తారు?

పోలీసులపై లగడపాటి ఆగ్రహం...వారెంట్‌ లేకుండా ఇంటికెలా వస్తారు?
X
Highlights

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ లో పోలీసులు అర్థరాత్రి హంగామా చేశారు. బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 65లోని వ్యాపారవేత్త...

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ లో పోలీసులు అర్థరాత్రి హంగామా చేశారు. బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 65లోని వ్యాపారవేత్త జీపీ. రెడ్డి నివాసంలో అర్ధరాత్రి సోదాలు నిర్వహించేందుకు వెళ్ళారు. సోదాలు చేయడానికి వెళ్ళిన పోలీసులను మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అడ్డుకున్నారు. అనుమతి లేకుండా అర్ధరాత్రి సోదాలు చేయడానికి ఎలా వచ్చారంటూ పోలీసులపై లగడపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి వారెంట్ లేకుండా జీపీ. రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించడానికి పోలీసులు రావడంపై లగడపాటి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సెర్చ్‌ వారెంట్‌ లేకుండానే సోదాలు ఎలా నిర్వహిస్తారని నిలదీశారు. పోలీసులు అకారణంగా తన మిత్రుడిని ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ భూమి విషయంలో జీపీరెడ్డిని పోలీసులు బెదిరిస్తున్నారని, ఆయనకు అనుకూలంగానే పోలీసులు వ్యవహరిస్తున్నారని లగడపాటి ఆరోపించారు. అర్ధరాత్రి ఇళ్లలో చొరబడి సోదాలు చేయమని చట్టం చెబుతుందా అని ప్రశ్నించిన ఆయన, పోలీసుల తీరుపై గవర్నర్‌, ఈసీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.

Next Story