ఆధార్‌ పేరుతో.. అమర జవాను భార్యను చంపేశారు!

ఆధార్‌ పేరుతో.. అమర జవాను భార్యను చంపేశారు!
x
Highlights

దేశంలో ప్రతి అంశానికి ఆధార్ తప్పనిసరి అయిపోయింది. ఆధార్ ఉంటేనే పని అవుతుంది. లేదంటే అంతే. ఆధార్ కార్డు ప్రాణాన్ని బలిగొన్నది అంటే ఆశ్చర్య పోవాల్సిన...

దేశంలో ప్రతి అంశానికి ఆధార్ తప్పనిసరి అయిపోయింది. ఆధార్ ఉంటేనే పని అవుతుంది. లేదంటే అంతే. ఆధార్ కార్డు ప్రాణాన్ని బలిగొన్నది అంటే ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఇది నిజంగా జరిగింది. హర్యానాలోని సోనిపట్‌లో ఆధార్ కార్డు లేకపోవడంతో ఓ ఆవిడ ప్రాణాలు కోల్పోయింది. ఆధార్‌ కార్డు లేదని చికిత్సకు నిరాకరించడంతో ఓ కార్గిల్‌ అమరజవాను భార్య మృతి చెందింది. హరియాణలోని సోనిపత్‌లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మృతురాలి కుమారుడు పవన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తన తల్లి పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆధార్‌ కార్డు అడిగారని, ఆసమయంలో తన దగ్గర లేకపోవడంతో మొబైల్‌లోని ఆధార్‌ కార్డు చూపించానని, చికిత్స చేయాలని, ఒక గంటలో తీసుకొస్తానని వేడుకున్నా కూడా వారు కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

ముందు డాక్యుమెంటేషన్ పూర్తయితేనే వైద్యం చేస్తామని డాక్టర్లు స్పష్టం చేశారని పవన్ చెప్పాడు. వైద్యులు నిర్లక్ష్యం చేయడంతోనే తన తల్లి ప్రాణాలు కోల్పోయిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఈ ఘటనపై ఆసుపత్రికి చెందిన ఓ వైద్యుడు ఆశ్చర్యకరంగా స్పందించాడు. ఆరోపణలు చేస్తున్న వ్యక్తి తమ ఆసుపత్రికి ఏ రోగినీ తీసుకురాలేదని, ఆధార్‌కార్డు లేదని తాము ఎప్పుడూ వైద్యం నిరాకరించలేదని సదరు డాక్టర్ చెప్పాడు.

ప్రాణాన్ని బలిగొన్న ‘ఆధార్’

Show Full Article
Print Article
Next Story
More Stories