కర్నూలు జిల్లాలో రేవ్ పార్టీ కలకలం

కర్నూలు జిల్లాలో రేవ్ పార్టీ కలకలం
x
Highlights

కర్నూలు జిల్లా కల్లూరులో రేవ్‌ పార్టీ కలకలం సృష్టించింది. ఓ ఫర్టిలైజర్స్ కంపెనీకి చెందిన డీలర్లు అంతా కలిసి ఓ ఫంక్షన్ హాల్‌‌లో రేవ్ పార్టీ...

కర్నూలు జిల్లా కల్లూరులో రేవ్‌ పార్టీ కలకలం సృష్టించింది. ఓ ఫర్టిలైజర్స్ కంపెనీకి చెందిన డీలర్లు అంతా కలిసి ఓ ఫంక్షన్ హాల్‌‌లో రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేశారు. ఆ సందర్భంగా మద్యం మత్తులో డ్యాన్సర్లతో ఏజెంట్లు ఘర్షణకు దిగారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం స్థానికంగా హాట్‌టాపిక్‌గా మారింది. గతంలో మరో ఫర్టిలైజర్స్ కంపెనీకి చెందిన డీలర్లు కూడా రేవ్ పార్టీ నిర్వహించారు. రేవ్ పార్టీ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories