గెలుపు ధీమాలో ఇరు పార్టీల హోరాహోరి.. గెలుపు ఎవరిని వరిస్తోందో?

x
Highlights

తెలంగాణ ఎన్నికల ఘట్టం ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం స్ట్రాంగ్ రూమ్ ల్లోకి చేరింది. గెలుపుపై ఎవరికి వారు ధీమాలో ఉన్నారు. తమ మ్యాజిక్ ఫిగర్ ఇదంటూ...


తెలంగాణ ఎన్నికల ఘట్టం ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం స్ట్రాంగ్ రూమ్ ల్లోకి చేరింది. గెలుపుపై ఎవరికి వారు ధీమాలో ఉన్నారు. తమ మ్యాజిక్ ఫిగర్ ఇదంటూ ప్రకటిస్తున్నారు. సంబరాలకు సిద్ధంగా ఉండాలంటూ కేటీఆర్ పిలుపునివ్వగా 12న ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు ఉత్తమ్ వెల్లడించారు. ఓ వైపు ఎగ్జిట్ పోల్ సర్వేలు మరోవైపు స్ట్రాంగ్ రూమ్ లకు చేరిన ఈవీఎంలు గెలుపుపై పార్టీలు ఎవరి ధీమాలో వారు ఉన్నారు. తమ మ్యాజిక్ ఫీగర్ ఇదంటూ పార్టీలు ప్రకటించుకుంటున్నాయి. స్ట్రాంగ్ రూమ్ లకు చేరిన ఈవీఎంలపై పార్టీలు ఓ కన్నేసి ఉంచాయి. 11న జరిగే కౌంటింగ్ అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నాయి.

ఎగ్జిట్ పోల్స్ సర్వేలు టీఆర్ఎస్ లో ఉత్సాహం నింపుతున్నాయి. సర్వేలన్నీ తమకు అనుకూలంగా ఉండటంతో పార్టీ శ్రేణులు ఆనందంలో మునిగితేలుతున్నారు. తెలంగాణ ప్రజలు ఏకపక్షంగా టీఆర్ఎస్ కు పట్టం కట్టబోతున్నారని కేటీఆర్ చెప్పారు. వందకు పైగా సీట్లు గెలిచి మళ్లీ అధికారంలోకి రాబోతున్నామని పార్టీ శ్రేణులు సంబరాలకు సిద్ధంగా ఉండాలంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూనే కేటీఆర్ ఈవీఎంలు, కౌంటింగ్ పూర్తయ్యే వరకు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రజా కూటమి అధికారం చేపట్టబోతుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ప్రజా కూటమి 70నుంచి 80స్థానాలు గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 12న మా ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందన్నారు ఉత్తమ్.

స్ట్రాంగ్ రూమ్ ల పట్ల ప్రజా కూటమి అనుమానాలు రేపింది. కొందరు అధికారులు స్ట్రాంగ్ రూమ్ లోపలికి వెళ్లి వస్తున్నట్లు ఉత్తమ్ ఆరోపించారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద అన్ని పార్టీల కార్యకర్తలు ఉండేలా అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రజా కూటమి కార్యకర్తలు స్ట్రాంగ్ రూమ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. అత్యధికంగా నమోదైన ఓటింగే ప్రజా కూటమి గెలుపునకునాంది అని టీటీడీపీ అధ్యక్షుడు రమణ అన్నారు. ప్రజలు తమ కూటమిపై నమ్మకం ఉంచారు. ప్రజా కూటమికేపట్టం కట్టబోతున్నారని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories