Top
logo

కేటీఆర్ పంచ్‌లు

కేటీఆర్ పంచ్‌లు
X
Highlights

తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ మన నగరం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కుత్బుల్లాపూర్‌లోని కొంపల్లిలో ...

తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ మన నగరం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కుత్బుల్లాపూర్‌లోని కొంపల్లిలో మన నగరం కార్యక్రమంలో ప్రజలకు గట్టిగానే చురకలంటించారు. ప్రజలు సామాజిక స్పృహ లేకుండా వ్యవహరిస్తున్నారని ముఖం మీద కొట్టినట్లు మాట్లాడారు. హైదరాబాద్‌లో చెత్తను వేరు చేయడానికి డస్ట్ బిన్లు పంపిణీ చేస్తే వాటిని ఎంత మంది వాడుతున్నారని ప్రశ్నించారు.

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనది మెట్రో రైలు. కళల ప్రాజెక్టుగా భావించిన మెట్రో రైలులో అప్పుడే కొంత మంది పాన్‌ను ఉమ్మివేయడం స్టార్ట్‌ చేశారంటూ మండిపడ్డారు. ప్రజల ప్రాజెక్ట్‌ను పరిశుభ్రంగా ఉంచుకోకపోతే ఎలా ? అన్నారు.

హైదరాబాద్ ఖ్యాతిని ప్రపంచానికి చాటేందుకు లవ్ హైదరాబాద్‌ సింబల్‌ను ట్యాంక్ బండ్‌ఫై పెడితే ఫోటోలు తీసుకుంటే బాగుండేదన్నారు. అయితే దాని మీద పిచ్చిరాతలు రాసి దాని చుట్టూ గలీజు గలీజు చేశారన్నారు. మనలో మార్పు రావాలని మార్పు రాకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు.

Next Story