శ్రీరెడ్డి ఆరోపణలపై కొరటాల క్లారిటీ!

x
Highlights

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై నటి శ్రీరెడ్డి కొద్దిరోజులుగా సంచలన ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శ్రీరెడ్డి పలువురు సెలబ్రిటీల పేర్లను...

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై నటి శ్రీరెడ్డి కొద్దిరోజులుగా సంచలన ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శ్రీరెడ్డి పలువురు సెలబ్రిటీల పేర్లను బయటపెట్టింది. వారిలో కొందరు ...శ్రీరెడ్డి వ్యాఖ్యలపై స్పందించగా...మరి కొందరు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివపై కూడా శ్రీరెడ్డి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ వ్యాఖ్యలపై కొరటాల శివ స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ కొరటాల శివ ఓ వీడియోను విడుదల చేశారు. తనపై సోషల్ మీడియాలో ఏవో ఆరోపణలు వచ్చాయని అవన్నీ అవాస్తవాలని చెప్పారు. 'భరత్ అనే నేను' సినిమా పోస్టు ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉండి ఇన్నాళ్లూ స్పందించలేక పోయానని చెప్పారు. తన జీవితంలో తన తల్లి భార్య తప్ప మరే స్త్రీ లేదని తెలిపారు.

‘‘గత వారం నాపై ఆరోపణలు చేస్తూ ఏవో స్ర్కీన్‌షాట్‌లు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయని తెలిసింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు చెన్నై, హైదరాబాద్‌, ముంబై తిరుగుతూ బిజీగా ఉండి అవన్నీ పట్టించుకోలేదు. ఆమె ఎక్కడా నా పేరు ప్రస్తావించలేదు. నా గురించి రాయలేదు. అవన్నీ గాసిప్స్‌ అని ఈజీగానే తీసుకున్నా. కానీ టీవీల్లో చర్చలు చూసి వివరణ ఇవ్వాలనిపించిది. నా చిన్నతనంలోనే నాన్న మరణించారు. అమ్మే నన్ను పెంచి ఇంతటివాణ్ణి చేసింది. పెళ్లయిన కొన్నాళ్లకు అమ్మ మరణిం చింది. అప్పటి నుంచీ నా భార్యే అన్నీ నాకు. మా కుటుంబం అంతా స్వామి వివేకానందను అనుసరిస్తాం. ‘క్యాస్టింగ్‌కౌచ్‌’ వంటి పనులకు నేను వ్యతిరేకిని. నా చుట్టు పక్కలవారిని కూడా ఆ పనుల జోలికి వెళ్లనివ్వను. నాది అలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ కాదు. సెట్‌లో ప్రతి ఒక్కరితో గౌరవంగా ఉంటా. నా నాలుగు సినిమాల్లో నటించిన ఆర్టిస్ట్‌లను ఎవరిని అడిగినా నా ప్రవర్తన ఎలా ఉంటుందో చెబుతారు. ఇండస్ట్రీలో ఏదన్నా పొరపాటు జరిగితే ‘మన ఇండస్ట్రీలో ఇలా జరగడం ఏంటి’ బాధపడతాం. అదీ మహిళల విషయమైతే ఇంకా ఎక్కువ బాధ కలుగుతుంది. నా సినిమాలో మహిళలకు వ్యతిరేకంగా చిన్న సీన్‌ ఉన్నా నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఈ వదంతులు గురించి తెలుసుకున్న మా ఆవిడ జనాలకు తెలిసేలా వివరణ ఇవ్వాలని కోరింది. సినిమా రిలీజ్‌కు ముందు ప్రశాంతంగా ఉండాలని వివరణ ఇస్తున్నా. మన సంప్రదాయంలో మహిళలకు ఎప్పుడూ పెద్దపీటే వేస్తాం. వారిని గౌరవించాలి, రక్షించాలి. ఇండస్ట్రీలో మహిళలకున్న సమస్యలపై పోరాడుతున్న వారిని మా సపోర్ట్‌ ఉంటుంది’’ అని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories