పరకాల పీఠంపై ఏ జెండా ఎగరబోతుంది..?

పరకాల పీఠంపై ఏ జెండా ఎగరబోతుంది..?
x
Highlights

ముందస్తు ఎన్నికలకు ముందే కొండ సురేఖపై టీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం వేటు వేసింది. టీఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాలో తన పేరు లేకపోవడంతో తీవ్రంగా...

ముందస్తు ఎన్నికలకు ముందే కొండ సురేఖపై టీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం వేటు వేసింది. టీఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాలో తన పేరు లేకపోవడంతో తీవ్రంగా నొచ్చుకున్న సురేఖ గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పింది. తీవ్ర అసంతృప్తితో రగిలిపోయిన కొండ సురేఖ తనేంటో ఎన్నికల్లో చూపిస్తానని కెసిఆర్ కు సవాల్ విసిరింది. అనంతరం రాహుల్ గాంధీతో మంతనాలు జరిపి చివరకు రాహుల్ సమక్షంలో కొండ దంపతులు కాంగ్రెస్ తీర్థంపుచ్చుకున్నారు. కాంగ్రెస్ లో కొండదంపతులు రెండు సీట్లు ఆశించినా అధిష్ఠానం ఒక్కదానితో సరిపెట్టుకొమని బుజ్జగించడంతో సురేఖ ఒక్కదానితో సరిపెట్లుకుంది. పరకాల నియోజకవర్గం కావాలనే కోరుకుంది. ఇక ఎప్పడైతే పరకాల సీటు ఖరార్ చేశారో అప్పటినుండి పరకాలలో వరుస ప్రచారలతో దూసుకుపొతున్నారు. సురేఖ పై పోటీ చేస్తున్నది టీఆర్ ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. గత ఏడాదే టీడీపీ నుండి పోటీచేసి భారీ విజయం సాధించారు. ఈసారి కూడా ఎలాగైన గెలిచి కొండాకు షాక్ ఇవ్వాలని గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. చల్లా ధర్మారెడ్డికి అధిష్ఠానం నుంచి అండదండలు ఉన్నాయి. ఐదేళ్లపాటు నియోజకవర్గానికి దూరంగా ఉండటంతో కార్యకర్తలంతా చల్లా వైపుకు మళ్లరని ఇప్పుడు వారిని వెనక్కి తీసుకురావడం కొండా దంపతులకు చాలా కష్టమవుతోందని తెలుస్తోంది. ఎన్నికల సమయంలో పార్టీ మారుతున్నారనే అపవాదు కూడా సురేఖకు నష్టం కలిగిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు అండగా నిలబడటం కంటే మొదలు తమ విజయంపై కొండా దంపతులు దృష్టిపెట్టాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. లేదంటే ఓటమి రూచి తప్పదని హెచ్చరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories