logo

నన్ను చంపాలని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది

నన్ను చంపాలని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది
Highlights

మాజీ మంత్రి, శాసనసభ్యత్వం కోల్పోయిన కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను...

మాజీ మంత్రి, శాసనసభ్యత్వం కోల్పోయిన కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. తమకు గన్ మెన్లను తొలగించడం ఈ కుట్రలో భాగమేనని అన్నారు. తనకు ఏమి జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పేంత పిరికిపందను కానని చెప్పారు. కేసీఆర్ నీ బుల్లెట్ కంటే నా గుండె చాలా గట్టిదని అన్నారు. ఈ ఉదయం సంపత్ తో కలసి ఆయన ఢిల్లీ వెళ్లారు. అంతకు ముందు మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మధ్యాహ్నం 3 గంటలకు వీరిద్దరూ ఎన్నికల కమిషన్ ను కలవనున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కల్పించాలని ఈసీని కోరనున్నారు.

లైవ్ టీవి

Share it
Top