Top
logo

‘కేసీఆర్‌కు మమత బెనర్జీ మొట్టికాయలు వేశారు’

‘కేసీఆర్‌కు మమత బెనర్జీ మొట్టికాయలు వేశారు’
X
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ థర్డ్ ఫ‌్రంట్‌ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి...

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ థర్డ్ ఫ‌్రంట్‌ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఒక వైపు మోడికి మద్దతిస్తూ మరోవైపు థర్డ్ ఫ్రంట్‌ అంటే ఎలా అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. ఫ్లోరైడ్‌ సమస్యను పరిష్కరించేందుకు కూర్చి వేసుకుని నీళ్లు తీసుకొస్తానన్న కేసీఆర్‌...ఆ సమస్యను గాలికి వదిలేశారని మండిపడ్డారు. నిన్న కోల్‌కతాకు వెళ్లిన కేసీఆర్‌కు మమత బెనర్జీ మొట్టికాయలు వేశారన్నారు. మోదీకి మద్దతు తెలుపుతూ థర్డ్ ఫ్రంట్ అంటే ఎలా అని మమత కేసీఆర్‌ను నిలదీశారన్నారు. మమత బెనర్జీది సాధారణ జీవితం అని, ఆమెను చూసైనా కేసీఆర్ విలాసవంతమైన జీవితానికి స్వస్తి చెప్పాలన్నారు. కేసీఆర్, మమతను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. జై తెలంగాణ అనని సంతోష్‌కు రాజ్యసభ టికెట్ కేటాయించారని కోమటిరెడ్డి విమర్శించారు.

Next Story