Top
logo

సొంత పార్టీ నేతలపై రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు...జైలుకి వెళ్ళొచ్చిన నేతలకు ...

X
Highlights

తెలంగాణ కాంగ్రెస్‌లో ఎన్నికల కమిటీలు పెట్టిన చిచ్చు రగులుతూనే ఉంది. కమిటీల కూర్పుపై నేతలు పరస్పర విమర్శలు...

తెలంగాణ కాంగ్రెస్‌లో ఎన్నికల కమిటీలు పెట్టిన చిచ్చు రగులుతూనే ఉంది. కమిటీల కూర్పుపై నేతలు పరస్పర విమర్శలు గుప్పించుకుంటున్నారు. తాజాగా కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ పెద్ద అంబర్ పేట దగ్గర ఓ ఫంక్షన్ హాల్లో కార్యకర్తల సమావేశంలో రాజగోపాల్‌రెడ్డి ఆవేశంగా మాట్లాడారు. జైలుకు వెళ్లొచ్చిన వారికి పదవులు ఇచ్చారన్న రాజగోపాల్‌రెడ్డి వార్డు మెంబర్‌గా కూడా గెలిచే సత్తా లేనివారికి కమిటీల్లో ప్రాధాన్యమిచ్చారని మండి పడ్డారు. తెలంగాణకు కుంతియా శనిలా తయారయ్యాడని వ్యాఖ్యానించారు. ప్రజల్లో బలంగా ఉన్న నాయకులకు ఎన్నికల కమిటీల్లో అన్యాయం జరిగిందని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు.

Next Story