logo
సినిమా

ప్రభాస్‌ బ్యాడ్‌ బాయ్‌ కానీ..

ప్రభాస్‌ బ్యాడ్‌ బాయ్‌ కానీ..
X
Highlights

బుల్లితెరపై బహుబలి టీం సందడి చేయనున్న సంగతి తెలిసిందే. స్టార్‌ వరల్డ్‌ ఇండియా చానెల్‌లో ప్రసారమవుతోన్న కాఫీ...

బుల్లితెరపై బహుబలి టీం సందడి చేయనున్న సంగతి తెలిసిందే. స్టార్‌ వరల్డ్‌ ఇండియా చానెల్‌లో ప్రసారమవుతోన్న కాఫీ విత్‌ కరణ్‌ షోకి బాహుబలి టీం రాజమౌళి, రానా, ప్రభాస్‌లు హజరయ్యారు. బుల్లితెరపై ఇప్పటికే రానా నం-1 యారీ కార్యక్రమంలో కనిపిస్తారు. అలాగే అప్పుడప్పుడు ఏదో కార్యక్రమంలో రాజమౌళి కూడా ప్రత్యక్షమౌతారు. కాగా బహుబలి-2 తరువాత యంగ్ రెబల్ స్టార్ సాహో చిత్రంలో ఫుల్ బీజీలో ఉన్నారు. కాగా తాజాగా కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో పాల్గోన్నారు. ఈనెల23 తారీకు నాడు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ ఎపిసోడ్‌ టీజర్‌ ప్రస్తుతం యూట్యూబ్‌లో తెగ ట్రెండ్‌ అవుతోంది. ఈ కార్యక్రమంలో కరణ్‌ మాట్లాడుతూ రానా, ప్రభాస్‌లలో ఎవరేక్కువ బ్యాడ్‌ బాయ్‌’ అని కరణ్‌, రాజమౌళిని(జక్కన్నను) ప్రశ్నించారు. దినికి జక్కన్న సమాధానం చెబుతూ ప్రభాస్‌ బ్యాడ్‌ బాయ్‌ కానీ అలా కనిపించడు అంటూ సమాధానమిచ్చారు. మొత్తానికి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులు ఈ ఆదివారం రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story