ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించిన ప్రజాకూటమి

x
Highlights

రైతులు, నిరుద్యోగులు, బడుగు, బలహీన వర్గాల ఒట్లే లక్ష్యంగా మహా కూటమి పీపుల్స్ మేనిఫెస్టో ప్రకటించింది. కేసిఆర్ రైతు బంధును ఢీకొనే విధంగా రైతులకు...

రైతులు, నిరుద్యోగులు, బడుగు, బలహీన వర్గాల ఒట్లే లక్ష్యంగా మహా కూటమి పీపుల్స్ మేనిఫెస్టో ప్రకటించింది. కేసిఆర్ రైతు బంధును ఢీకొనే విధంగా రైతులకు మరిన్ని రాయితీలు ప్రకటించింది.అంతేకాదు పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెస్తామనడం కూటమి ప్రత్యేక వాగ్దానం ప్రజాకర్షక పథకాలకే పెద్ద పీట వేసిన మేనిఫెస్టోలో అభివృద్ధికి సంబంధించిన అంశాలేవీ పెద్దగా కనపడకపోవడం విశేషం. తీవ్ర తర్జన భర్జనల అనంతరం తెలంగాణ ఎన్నికల కోసం ప్రజా కూటమి ఎట్టకేలకు ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసింది.రైతులు, నిరుద్యోగులు, యువత ఓట్లనే టార్గెట్ చేస్తూ ఎన్నో రాయితీలు, తాయిలాలూ ప్రకటిస్తూ ప్రజా కూటమి మేనిఫెస్టో రూపొందింది. హైదరాబాద్ గోల్కొండ హోటల్ లో టీజేఎస్ నేత కోదండ రామ్ మేనిఫెస్టో విడుదల చేశారు. టీఆరెస్ రైతు బంధు పథకానికి దీటుగా ప్రజాకూటమి మేనిఫెస్టోలో చాలా ఆకర్షణలే ఉన్నాయి రైతులకు వడ్డీ లేని రుణాలిస్తామనీ, అలాగే రైతులకు ఏకకాలంలో రెండు లక్షల వరకూ రుణ మాఫీ కల్పిస్తామనీ మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

అంతేనా వంద యూనిట్లలోపు కరెంట్ వాడే వారికి ఉచితంగా కరెంట్ అందిస్తారు. ఇక టీఆరెస్ తురుపు ముక్కగా చెప్పుకుంటున్న రైతు బంధు పథకానికి దీటుగా కూటమి కూడా రైతులకు చాలా ఆకర్షణలే ఎర వేస్తోంది. ప్రతీ రైతుకు పెట్టుబడి సాయంగా ఎకరాకు మూడు వేలిస్తారు.పదివేల కోట్లతో పంట కొనుగోలు నిధిని కూడా ఏర్పాటు చేస్తూ రైతులకు ఊరట కల్పిస్తారు. అయితే ఇప్పటి వరకూ రైతు బంధుకింద ఎకరాకు రెండు వేలిస్తున్న కేసిఆర్ ప్రభుత్వం మళ్లీ తమను ఎన్నుకుంటే రైతు బంధు పథకం సొమ్ము మొత్తాన్ని 5 వేలకు పెంచుతామని ఇప్పటికే ప్రకటించింది. ఇక మహాకూటమి అధికారంలోకి వస్తే పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెస్తామని వాగ్దానం చేస్తోంది. ఇది మహా కూటమికి ప్లస్ అయ్యే పాయింట్. పెట్రో రేట్లను జీ ఎస్టీ పరిధిలోకి తేడానికి ఇప్పటి వరకూ ఏ రాష్ట్రమూ అంగీకరించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలకు అధిక ఆదాయాన్ని సమకూర్చే పెట్రోల్ రేట్లను తగ్గించడానికి ఏ ప్రభుత్వమూ ఒప్పుకోదు. కానీ మహా కూటమి ఈ హామీ ఇవ్వడం విశేషం మధ్య తరగతి వారు, ఉద్యోగులు ఈ హామీ పట్ల ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. అలాగే ప్రజాకూటమి మరో కీలక వాగ్దానం చేస్తోంది. ఏడాదికి లక్ష ఉద్యోగాల కల్పన ధ్యేయంగా అడుగేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇది నిరుద్యోగులకు సంతోషం కలిగించే వార్త.. నిరుద్యోగులకు మూడు వేలు భృతి అందిస్తామనడం కూడా యువతను ఆకర్షించేదే ఫీజు రీయింబర్స్ మెంట్ సకాలంలో జరిగేలా చూస్తామనీ, ఉద్యమకారులందరిపైనా కేసులు ఎత్తేస్తామనీ ఈ కూటమి హామీ ఇచ్చింది.

ఉద్యమ కళాకారులకు తగిన గుర్తింపు, గౌరవం దక్కేలా చూస్తామని, 104,108 సేవలు సక్రమంగా అందేలా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని కూడా మహా కూటమి హమీ ఇస్తోంది. ఇవేకాక ఇంకా భిన్న వర్గాలకు వాగ్దానాలు ఈ మేనిఫెస్టోలో ఉన్నాయి. ఇప్పటికే టిఆరెస్ కూడా తమ మేనిఫెస్టో సిద్ధం చేసినా, కూటమి మేనిఫెస్టో చూశాకే తమది విడుదల చేయాలనే పట్టుదలలో కేసిఆర్ ఉన్నారు. మహా కూటమి వాగ్దానాలకన్నా మెరుగైన వాగ్దానాలూ, ప్రత్యేక ఆకర్షణలు ఉండేలా టీఆరెస్ జాగ్రత్త పడుతోంది. అందులో పెన్షనర్లకు ప్రత్యేక డైరక్టరేట్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఒకటి మహాకూటమి మేనిఫెస్టో వచ్చేసింది కాబట్టి ఇక టీఆరెస్ మేనిఫెస్టో రావడమే తరువాయి కనీస ఉమ్మడి కార్యాచరణ కింద మేనిఫెస్టోను చేర్చిన కూటమి వీటి అమలుకు ఛైర్మన్ గా కోదండరామ్ ను నియమించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories