కిల్లింగ్ గేమ్స్... మితిమీరితే...

కిల్లింగ్ గేమ్స్... మితిమీరితే...
x
Highlights

హింస ఫ్యాషన్, చంపడం సరదా ఇంకొకరి ఆస్థి దోచుకోవడం ఆనందం.. అడ్డొచ్చినవారిని కారణం లేకున్నా కొట్టొచ్చు.. ఎదురించిన వారిని ఏమైనా చెయ్యొచ్చు.. విలువలు...

హింస ఫ్యాషన్, చంపడం సరదా ఇంకొకరి ఆస్థి దోచుకోవడం ఆనందం.. అడ్డొచ్చినవారిని కారణం లేకున్నా కొట్టొచ్చు.. ఎదురించిన వారిని ఏమైనా చెయ్యొచ్చు.. విలువలు నేర్పవు.. తెలిపి పెంచవు, ఆహ్లాదాన్ని అందించవు.. కానీ అవంటే యమ క్రేజు..ప్రస్తుతం టాప్ వీడియోగేమ్స్ ఇలానే సాగుతాయి.. చిన్నారుల చేతులతో ఆడే మొబైల్ గేమ్స్.. వారి జీవితాలతో ఆడుకుంటున్నాయి.. హింసకు ప్రేరేపిస్తున్నాయి.. ఆటలో క్యారెక్టర్ తమని తాము ఊహించుకుంటూ.. అఘాయిత్యాలు చేసేందుకు కారణం అవుతున్నాయి.

ఆరు బయట అందరితో ఆడుకోవాల్సిన పిల్లలు నాలుగు గోడల మధ్య బందీ అవుతున్నారు. ఇప్పుడు ఎవరిని చూసినా ముబైల్ గేమ్స్ తో బిజీగా కనిపిస్తున్నాయి కదలకుండా గంటల తరబడి కూర్చొని గేమ్స్‌ ఆడటం కోసం, తిండి, నిద్ర సైతం వదులు కుంటున్నారు ప్రతి ఇంటిలోనూ ఇలా వీడియో గేమ్స్‌కు బానిసవుతున్న వారు చాలామంది ఉన్నారు. ఏడాదిన్నర వయసున్న పిల్లలు కూడా చేతిలో సెల్‌ఫోన్‌ పట్టుకుని తమకు ఇష్టమైన గేమ్స్‌, రైమ్స్‌, పాటలు పెట్టుకుని మురిసిపోతున్నారు.

చిన్నారులు ఆడుతున్న గేమ్స్ లో రక్తపాతం, హింసతో కూడి ఎక్కువగా ఉంటున్నాయి. కాల్చాలి, చంపాలి వాళ్ల టార్గెట్ అదే కంప్యూటర్, లేదా ట్యాబ్ అదీ కదంటే సెల్ ఫోన్ లో ఈ గేమ్స్ ఆడుతూ పిల్లలు లోకాన్నే మర్చి పోతున్నారు. హైదరాబాద్‌లో నగరంలో 40 శాతం మందికి పైగా పిల్లలు వీడియో గేమ్స్ ఆడుతుంటే వారిలో 12 శాతం మంది గేమ్స్ కు బానిసలుగా మారుతున్నారని సర్వేల్లో తెలుస్తున్నాయి.

నలుగురితో కలిసి మాట్లాడటం, ఇతరులతో కలిసి అభిప్రాయాలు పంచుకోవడం, వారి మంచిచెడులు విచారించడం ఇవ్వన్నీ మానసిక పరిణితిని పెంచేవే. సంప్రదాయ ఆటల్లో ఇవన్నీ భాగంగా ఉంటాయి అయితే వీడియో గేమ్స్ లో వీటికి చోటు లేదు ఇక ఎక్కువ సమయం గేమ్స్ ఆడటం వల్ల వారికి తీవ్ర మానసిక రుగ్మతలు తలెత్తే ప్రమాదం కూడా ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు గేమ్ ఓడిపోతామన్న ఆందోళన ఒత్తిడి కుంగుబాటుకు దారితీస్తున్నాయి దీంతో అనేక మానసిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

ఇటీవల చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు వీటి ప్రభావం ఏస్థాయిలో ఉన్నాయో చెబుతున్నాయి మొన్నటికి మొన్న ఖమ్మం జిల్లా ప్రభుత్వ గిరిజన పాఠశాలలో నాల్గో తరగతి విద్యార్థుల మధ్య సెల్ ఫోన్ పై గొడవ మొదలై ఓ చిన్నారిని పొట్టన పెట్టుకుంది. ఈ గొడవకు కారణం మొబైల్ గేమ్ హైదరాబాద్ లో 12ఏళ్ల అమ్మాయిపై యువకుడి హత్యాచారానికి కూడా ఒక విధంగా ముబైలే లే కారణం.

చిన్న పిల్లలు మనసుకు ఏది ఆనందం అనిపిస్తే అది చేస్తారు అందుకే వీడియో గేమ్స్ ఆడుతుంటారు నెట్ లో కాలక్షేపం చేస్తారు వీటి కారణంగా వారి జీవితాలు నాశనం అవుతున్నాయి ఆడి పాడాల్సిన బాల్యంలో గొడవలు, అత్యాచారాలు, హ్యతలు, హింసలులతో కరుకుగా మారుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories