వాళ్లను కాల్చిపారేయండి.. సీఎం సంచలన వ్యాఖ్యలు

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి వివాదంలో ఇరుక్కున్నారు. జేడీస్ నేతను హత్య చేసిన వ్యక్తిని నిర్ధాక్షిణ్యంగా...
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి వివాదంలో ఇరుక్కున్నారు. జేడీస్ నేతను హత్య చేసిన వ్యక్తిని నిర్ధాక్షిణ్యంగా చంపేయాలని ఆదేశాలిస్తూ అడ్డంగా దొరికిపోయారు. హొణ్నలగెరె ప్రకాశ్ అనే నేతను నిన్న సాయంత్రం బైక్ పై వెంబడించిన ఇద్దరు వ్యక్తులు, మద్దూర్ వద్ద అడ్డుకుని విచక్షణా రహితంగా దాడి చేయగా, తీవ్ర గాయాల పాలైన ప్రకాశ్, చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషయం తెలిసిన సీఎం కుమారస్వామి తీవ్రంగా స్పందించారు. దోషులు కనిపిస్తే కనికరం లేకుండా కాల్చి పారేయాలంటూ పోలీసులకు ఉత్తర్వులిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేయడంతో సీఎం వెనక్కి తగ్గారు. ఏదో కోపంలో అలా అన్నానే కానీ, ముఖ్యమంత్రిగా పోలీసు అధికారులకు ఆదేశాలివ్వలేదన్నారు. ప్రకాశ్ హత్యకు కారకులుగా అనుమానిస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులు ఇంతకుముందు మరో రెండు హత్య కేసుల్లో నిందితులుగా ఉండి, బెయిల్‌పై బయటకు వచ్చారన్నారు. ఈ ఘటనకు నిరసనగా జేడీఎస్ కార్యకర్తలు రోడ్లపై బైఠాయించారు.
జనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్‌లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMTనల్గొండ జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర
10 Aug 2022 1:12 AM GMTSinkhole: భారీగా పెరుగుతున్న వింత గొయ్యి లోతు..
9 Aug 2022 3:00 PM GMT
స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా 5కే రన్
11 Aug 2022 3:19 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTఇవాళ తెలంగాణ మంత్రివర్గం సమావేశం
11 Aug 2022 2:16 AM GMTఇవాళ గాంధీభవన్‌లో రేవంత్ అధ్యక్షతన కీలక సమావేశం
11 Aug 2022 1:46 AM GMTకేసీఆర్ జిల్లాల పర్యటనకు రంగం సిద్ధం
11 Aug 2022 1:06 AM GMT