నదిని ఈదుకుంటూ పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు.. వీడియో

x
Highlights

మనసుంటే మార్గముంటుందని ఎలాంటి అవరోధాన్నైనా అవలీలగా అధిరోహించవచ్చని నిరూపిస్తున్నారు సోటియా గ్రామానికి చెందిన విద్యార్ధులు. వీరంతా ప్రతి రోజు...

మనసుంటే మార్గముంటుందని ఎలాంటి అవరోధాన్నైనా అవలీలగా అధిరోహించవచ్చని నిరూపిస్తున్నారు సోటియా గ్రామానికి చెందిన విద్యార్ధులు. వీరంతా ప్రతి రోజు దగ్గర్లోని పాఠశాలకు వెళ్లంటే గైలడరి నదిని దాటుకుంటూ వెళ్ళాల్సిందే. అక్కడ వంతెన నిర్మించకపోవడంతో చిన్న చిన్న వంట పాత్రల సహాయంతో ఈదుకుంటూ అవతలకి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు కూడా వాటి సహాయంతోనే ఇళ్లకు చేరుతున్నారు.

అసోంలోని బిశ్వనాథ్ జిల్లా నదువార్ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రతి రోజు విద్యార్ధులు పెద్ద సాహసమే చేస్తున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అల్యూమినియం పాత్రల సహాయంతో నదిని దాటి తమ పాఠశాలకు చేరుకుంటున్నారు విద్యార్థులు. అల్యూమినియం పాత్రల సహాయంతో నది దాటుతున్న విద్యార్థుల వీడియోలు వైరల్‌గా మారాయి.

నాలుగేళ్లుగా చిన్నారులు ఎలాంటి భయం లేకుండా ఉత్సహంగా స్కూళ్లకు వెళ్తున్నారు. ఏ మాత్రం అదుపుతప్పిన విద్యార్థులు నదిలో కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఆ పాఠశాల ఉపాధ్యాయుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించిన పట్టించుకోవడం లేదని స్ధానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు స్థానికులు.

Show Full Article
Print Article
Next Story
More Stories