తెలంగాణ తొలి తరం ఉద్యమకారుడు ప్రోఫెసర్ కేశవ రావ్ జాదవ్ అస్తమయం

తెలంగాణ తొలి తరం ఉద్యమకారుడు ప్రోఫెసర్ కేశవ రావ్ జాదవ్ అస్తమయం
x
Highlights

తెలంగాణ తొలి తరం ఉద్యమకారుడు ప్రోఫెసర్ కేశవ రావ్ జాదవ్ అస్తమించారు. ప్రత్యేక తెలంగాణ కోసం ముల్కి ఉద్యమం నుంచి ప్రతి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయన...

తెలంగాణ తొలి తరం ఉద్యమకారుడు ప్రోఫెసర్ కేశవ రావ్ జాదవ్ అస్తమించారు. ప్రత్యేక తెలంగాణ కోసం ముల్కి ఉద్యమం నుంచి ప్రతి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయన గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ రోజు తెల్లవారుజామున స్వగృహంలో కన్నుమూశారు. ఉస్మానియా యూనివర్సిటిలో ప్రోఫెసర్‌గా పనిచేసి పదవి విరమణ చేసిన ఆయన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రోఫెసర్ జయశంకర్‌తో కలిసి పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. ప్రత్యేక తెలంగాణ దిశగా ప్రజలను జాగృతం చేయడంలో కీలకపాత్ర పోషించారు.. తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ఛైర్మన్‌గా ఉంటూ ఉద్యమానికి తన వంతు సాయం అందించారు. లోహియా అనుచరుడిగా గుర్తింపు పొందిన కేశవ రావ్‌ జాదవ్ .. జీవితాంతం సోషలిస్టుగానే బతికారు. అత్యవసర సమయంలో కొద్దిరోజుల పాటు జైలు జీవితం కూడా అనుభవించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories