logo
జాతీయం

స్వామి సందీపానంద ఆశ్రమంపై దాడి... వాహనాలకు నిప్పు

స్వామి సందీపానంద ఆశ్రమంపై దాడి... వాహనాలకు నిప్పు
X
Highlights

కేరళలో స్వామి సందీపానంద గిరి స్వామి ఆశ్రమాన్ని తగులబెట్టారు. భగవద్గీత స్కూల్ డైరక్టర్‌గా స్వామి సందీపానంద...

కేరళలో స్వామి సందీపానంద గిరి స్వామి ఆశ్రమాన్ని తగులబెట్టారు. భగవద్గీత స్కూల్ డైరక్టర్‌గా స్వామి సందీపానంద కొనసాగుతున్నారు. శబరిమలలోకి అన్ని వయసుల మహిళలు ప్రవేశించవచ్చు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు సందీపానంద స్వామి మద్దతు ఇచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు స్వామి ఆశ్రమంపై దాడి చేసినట్లు తెలుస్తోంది. కుందమన్‌కడవు ప్రాంతంలో ఉన్న ఆశ్రమంలో రెండు కార్లు, ఓ స్కూటర్‌కు నిప్పుపెట్టారు. శుక్రవారం అర్థరాత్రి 2.30 నిమిషాలకు ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధరన్ పిళ్లె, శబరిమల తంత్రితో పాటు పాండలం రాజ కుటుంబమే ఈ దాడికి కారణమంటూ సందీపానంద ఆరోపించారు. ప్రజలకు వాస్తవాలను తెలిపే వ్యక్తులపై వాళ్లు దాడి చేస్తున్నారని సందీపానంద విమర్శించారు. శబరిమలపై సుప్రీం తీర్పును స్వాగతించిన తర్వాత తనకు బెదిరింపులు వచ్చాయని ఆయన అన్నారు.

Next Story