పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం

పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం
x
Highlights

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ ఉంటే కేరళ రాష్ట్రం మాత్రం వాటి ధరలను తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వఖజానాకు కోట్లాది...

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ ఉంటే కేరళ రాష్ట్రం మాత్రం వాటి ధరలను తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వఖజానాకు కోట్లాది రూపాయల భారం పడుతున్నా లెఫ్ట్ ప్రభుత్వం ప్రజల అవస్థలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ ధరలపై అమ్మకం పన్ను తగ్గించడంతో వాటి ధరలు ఒక్క రూపాయి తగ్గనుంది.

వాహనదారులకు కాస్త ఉపసమనం కలిగేలా కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోలియం ఉత్పత్తులపై ఆయిల్ కంపెనీలో ఒక్కపైసా తగ్గించగా...కేరళ సర్కార్ ఒక్క రూపా6యి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తగ్గించిన ధరలు మే 31 అర్ధరాత్రి నుంచి అమలు కానున్నాయని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని కోరుకుంటున్నామని సీఎం ఎద్దేవా చేశారు. దేశంలో చమురు ధరలు తగ్గించిన మొదటి రాష్ట్రం కేరళ నిలవనుందని ముఖ్యమంత్రి అన్నారు.

పెట్రోల్ ధరలో 1.69 శాతం, డీజిల్ ధరపై 1.75 శాతం సేల్స్ టాక్స్ తగ్గించారు. గత 15 రోజులుగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెట్రోల్ ధరలో 3.30 రూపాయలు, డీజిల్ ధరలో 2.88 రూపాయలు మార్పు వచ్చింది. దీంతో వాహనదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తం వివిధ పార్టీలకు చెందిన నేతలు నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఇన్ని రకాల నిరసనలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం ధరల విషయంలో జోక్యం చేసుకోవడం లేదు. పెట్రోలియం శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ధరల తగ్గింపు విషయంలో చేతులెత్తేశారు.

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు విషయంలో జోక్యం చేసుకోవపోవడంతో బీహార్ వాసులు ఓ కొత్త మార్గాన్ని అన్వేషించారు. నేపాల్ నుంచి పెట్రోల్ ను దిగుమతి చేసుకుంటున్నారు. అక్కడి పెట్రోల్, డీజిల్ ధరలకు దాదాపు 15 రూపాయల తేడా ఉండడంతో అక్కడి నుంచి పెట్రోల్ క్యాన్ లు బీహార్ లో ప్రత్యక్ష మౌతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories