logo
జాతీయం

శబరిమల వివాదం.. సర్కార్ మరో చర్య

శబరిమల వివాదం.. సర్కార్ మరో చర్య
X
Highlights

కేరళలోని శబరిమల టెంపుల్ పరిసరాల్లో పోలీసుల ఆంక్షలపై ఆందోళనలు మిన్నంటుతున్నాయి. కేరళ అశేష భక్తులు వారికి అండగా...

కేరళలోని శబరిమల టెంపుల్ పరిసరాల్లో పోలీసుల ఆంక్షలపై ఆందోళనలు మిన్నంటుతున్నాయి. కేరళ అశేష భక్తులు వారికి అండగా ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు పోరాడుతుంటే కేరళ ప్రభుత్వం మాత్రం ఎలాగైనా మహిళలకు పోలీసు భద్రతతో శబరిమలలోకి ప్రవేశింప పెట్టాలని నిర్ణయిస్తుంది. కాగా తాజాగా కేవలం రెండే రోజులు ప్రత్యేకంగా మహిళ భక్తులను ఆలయంలోకి ప్రవేశపెట్టె ప్రతిపాదన కేరళ ప్రభుత్వం తీసుకురాగా, ఈవిషయంపై దేవస్థానం బోర్డుతో మంతనాలు జరిపి హైకోర్టుకు వెల్లడించింది. ఇది ఇలా ఉంటే కేరళ సర్కార్ పై హిందుత్వవాదులు తీవ్రస్థాయిలో గగ్గోలుపెడుతున్నారు. ఇక రెండ్రోజులు ఆలయంలోకి మహిళలను అనుమతిస్తే ఆలయం మొత్తం రణరంగంగా మారడం ఖాయామని హెచ్చరించారు. కాగా నలుగురు మహిళలు కేరళ హైకోర్టు పిటిషన్ వేశారు. దీంతో ఈ కేసును నవంబర్ 28కి వాయిదా వేశారు. ఆలయంలోకి ప్రవేశింప చేయాలనే ప్రతిపాదనలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్న వేళ కేరళలో కొన్ని ప్రాంత్రాల్లో 144 సెక్షన్ విధించారు.

Next Story