logo
సినిమా

కేర‌ళ సర్కార్ నుండి బన్నీకి ఆహ్వానం

కేర‌ళ సర్కార్ నుండి బన్నీకి ఆహ్వానం
X
Highlights

తెలుగు అగ్రహీరోల్లో ఒకరైనా స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్‌కి తెలుగులోనే కాదు మ‌ల‌యాళంలోను అభిమానుల ఆదరణ ఉన్న...

తెలుగు అగ్రహీరోల్లో ఒకరైనా స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్‌కి తెలుగులోనే కాదు మ‌ల‌యాళంలోను అభిమానుల ఆదరణ ఉన్న సంగ‌తి తెలిసిందే. కేర‌ళ‌లో అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయిందంటే అక్క‌డి అభిమానులకు పండగే. తాజాగా కేర‌ళ‌లో వ‌ర‌ద బీభ‌త్సానికి చాలామంది నిరాశ్ర‌యులు కాగా, వదర బాధితులకు బన్ని సాయంగా రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించి గొప్ప మ‌న‌సు చాటుకున్నాడు. దీంతో రియ‌ల్ హీరోగాను బ‌న్నీ మ‌ల‌యాళ అభిమానుల మ‌న‌సుల‌లో చెరగని ముద్ర వేసుకున్నాడు. అయితే నవంబర్ 10న కేర‌ళ ప్ర‌భుత్వం నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ నిర్వ‌హిస్తుంది. అలప్పిలోని మాడ లేక్‌లో జరగనున్న ఈ పోటీలో మొత్తం 81 బోట్లు తలపడతాయని సమాచారం.ఈ పోటీల‌కి బ‌న్నీని ముఖ్య అతిధిగా ఆహ్వానించారు.

Next Story