రొమాన్స్, కామెడీ, సెక్స్.. పిచ్చి వర్మ: కీరవాణి

రొమాన్స్, కామెడీ, సెక్స్.. పిచ్చి వర్మ: కీరవాణి
x
Highlights

సంగీత దర్శకుడు కీరవాణి గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ సినిమా గురించి ట్వీట్ చేశారు. విలక్షణ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్...

సంగీత దర్శకుడు కీరవాణి గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ సినిమా గురించి ట్వీట్ చేశారు. విలక్షణ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ)తో తన సంగీతాన్ని వర్మ మరో మెట్టు ఎక్కించాడంటూ కీరవాణి పొగడ్తలు కురిపించారు. పొర్న్‌ స్టార్‌ మియా మల్కోవాతో వర్మ రూపొందించిన వీడియోకు కీరవాణి సంగీతం అందించిన విషయం తెలిసిందే. ‘‘సెల్యులాయిడ్‌పై పలు రకాల భావాలను పలికించే ఆయన తెలివితేటలు నన్నో మెట్టు ఎక్కించాయి. 1991లో రొమాన్స్‌ను, 92లో కామెడీని, 2018లో సెక్స్‌కు సంగీతం అందించాను. ఈ సంవత్సరంలో ఆయన తీయనున్న హారర్, వయొలెన్స్ చిత్రాలకు సంగీతం అందించబోతున్నా. నన్ను నమ్మిన పిచ్చి దర్శకుడికి థాంక్స్.’’ అంటూ కీరవాణి ట్వీట్ చేశారు. దీనికి వర్మ కూడా ‘థ్యాంక్స్ కీరూ’ అని రీ ట్వీట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories