Top
logo

స్మార్ట్ ఫోన్ తో సరికొత్త వ్యాధులు..మొబైల్ ను చూసేందుకు మెడను వంచారో.. మటాష్

స్మార్ట్ ఫోన్ తో సరికొత్త వ్యాధులు..మొబైల్ ను చూసేందుకు మెడను వంచారో.. మటాష్
X
Highlights

సెల్ ఫోన్ వల్ల ఇన్నాళ్లూ రేడియేషన్ ప్రాబ్లమే అని అనుకున్నాం. కానీ అంతకుమించి సమస్యలను తెచ్చిపెడుతోందీ.....

సెల్ ఫోన్ వల్ల ఇన్నాళ్లూ రేడియేషన్ ప్రాబ్లమే అని అనుకున్నాం. కానీ అంతకుమించి సమస్యలను తెచ్చిపెడుతోందీ.. స్మార్ట్ ఫోన్. మన జీవనచిత్రాన్ని పూర్తిగా మార్చేస్తూ.. బతుకంతా నేల చూపులు చూపించే ప్రమాదాన్ని మోసుకొస్తుంది. మెడను వంచుతూ మొబైల్ చూస్తే.. స్పాండిలైటిస్ వంటి దీర్ఘ కాలిక వ్యాధులను కొనితెచ్చుకోక తప్పదంటున్నారు డాక్టర్లు.

గాడ్జెట్స్.. మన డైలీ లైఫ్ ను శాసిస్తున్నాయి. అవిలేని రోజు అనేది ఊహకు కూడా అందని విషయం. అందులో స్మార్ట్ ఫోన్ అనేది మేజర్ పార్ట్. మొబైల్ మనదగ్గరుంటే.. ప్రపంచమంతా మన చేతిలోనే ఉందన్న భరోసా. అయితే ఆ భరోసానే మన కొంపముంచుతోంది. సెల్ ఫోన్ వాడకం పెరిగినా కొద్దీ.. అంతకంతకూ కష్టాలు కొనితెచ్చుకునే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా మొబైల్ లో వాట్సాప్ యాప్ వచ్చాక చేతిలో పట్టుకుని చూడాల్సి వస్తుంది కాబట్టి.. మెడను కచ్చితంగా వంచాల్సిందే. అయితే గంటల తరబడి మెడను అలాగే కిందకు వంచి ఉంచినట్లైతే స్పాండిలైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయని.. తద్వారా మన బతుకు చిత్రమే మారుతుందని.. డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. స్ట్రెయిట్ గా ఉండాల్సిన బాడీ.. వంగిపోయే ప్రమాదం ఉందంటున్నారు.

18 నుంచి 45 యేళ్ల వయస్సున్న 60 శాతం మంది మెడనొప్పితో బాధపడుతున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. అయితే మెడను ఏ మేరకు వంచితే.. ఎంత ముప్పు పొంచి ఉందో డాక్టర్లు వివరిస్తున్నారు. మెడ ఏ ఏ డిగ్రీల మేర వంగినప్పుడు.. వెన్నుపై పడే ప్రభావం ఎలా ఉంటుందనే దాన్ని కూడా విశ్లేషిస్తున్నారు. దీన్ని వైద్య పరిభాషలో టెక్ట్స్ నెక్ సిండ్రోమ్ గా అభివర్ణిస్తారని.. వెల్లడిస్తున్నారు.

మెడ స్ట్రేయిట్ గా అంటే సున్నా డిగ్రీల దగ్గర ఉంటే ఎలాంటి సమస్య లేదంటున్న డాక్టర్లు.. సున్నా నుంచి 15 డిగ్రీల వరకు వంచితే.. వెన్నుపై 4.5 నుంచి 6.35 కిలోల బరువు పడుతుందని చెబుతున్నారు. అలాగే 15 నుంచి 30 డిగ్రీల మేర మెడను వంచితే.. 20 కిలోల వరకు బరువు వెన్నుపై పడుతుంది. అదే 60 డిగ్రీల మేర మెడను వంచితే.. వెన్నుపూసపై ఏకంగా 30 కిలోల బరువు పడుతుందని.. ఇలా దీర్ఘకాలికంగా వెన్నుపై బరువు పడితే.. మెడలోని ఎముకలు తొందరగా అరిగిపోయే ప్రమాదం ఉందంటున్నారు.

కనీసం ఆరు నెలల పాటూ గంటల తరబడి మెడను వంచి సెల్ ఫోన్ లను యూజ్ చేస్తే.. పెయిన్ ప్రారంభం అవుతుందని.. తర్వాత అది స్పాండిలైటిస్ గా మారుతుందని.. ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ మోహన్ కృష్ణ చెబుతున్నారు. తమ దగ్గరకు ఈ మధ్య ఇలాంటి కేసులే ఎక్కువగా వస్తున్నాయని.. అవసరాన్ని మించి సెల్ ఫోన్ వాడొద్దంటున్నారు.

సమస్య రానంతవరకు సెల్ ఫోన్ ను ఉపయోగించుకోవాలని.. వైద్యులు సలహా ఇస్తున్నారు. అయితే నొప్పి ప్రారంభం అయితే మాత్రం.. రకరకాల ఎక్సర్ సైజులతో పాటు.. ఫిజియోథెరపి చేసుకుంటే.. కొంతమేర ఉపశమనం పొందొచ్చని చెబుతున్నారు. సెల్ ఫోన్ ను ఉపయోగించొద్దనేది అవివేకమే. అయితే దాన్ని ఎంతమేర అవసరమో అంతే యూజ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎక్కువ సమయం మొబైల్ ఫోన్ మీదే గడపాల్సి వస్తే.. ఏదైనా సపోర్ట్ తీసుకోవాలని సూచిస్తున్నారు.

మరి పెద్దవాళ్లేనా.. ఈ సమస్యతో బాధపడేది.. చిన్నారుల పరిస్థితి ఏంటి..? ప్రతీది సెల్ ఫోన్ లో దొరుకుతుండటంతో పిల్లలు కూడా దానికి అడిక్ట్ అవుతున్నారు. ఆఖరకు చిన్నారులను ఒళ్లో కూర్చుండబెట్టుకుని చెప్పాల్సిన రైమ్స్ కూడా సెల్ ఫోన్ ను పిల్లల చేతికందించి చేతులెత్తేస్తున్నారు. దీంతో 20 యేళ్ల తర్వాత కొనితెచ్చుకునే రోగాలను ఇప్పటి నుంచే వారికి అందిస్తున్నారు నేటి పేరెంట్స్.

సెల్ ఫోన్.. స్మార్ట్ గా మారి.. మరింత సున్నితమైన సమస్యలను తెచ్చిపెడుతోంది. అయితే పెద్దవాళ్ల సంగతి సరే సరి. అవసరాలకు మించి వాడుతున్నా వారికి తెలిసే జరుగుతుంది. మరి చిన్నారుల పరిస్థితి ఏంటి..? చిన్నపాటి బరువును కూడా మోయలేని ఆ చిట్టిచేతుల్లో స్మార్ట్ ఫోన్ పెట్టేసి అన్నీ దాన్నుంచే నేర్పిస్తున్నారు వారి తల్లిదండ్రులు. రోజూ వారి రైమ్స్ కూడా మొబైల్స్ నుంచే నేర్పించడం బంధువులతో మాట్లాడించడం వంటివి చేస్తూ గంటల కొద్దీ సెల్ ఫోన్ తో టైమ్ పాస్ చేయిస్తున్నారు.

అయితే సెల్ ఫోన్ ను పూర్తిగా అవాయిడ్ చేయాలంటున్నారు నిపుణులు. చేతుల్లో పట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి తప్పకుండా మెడ వంచాల్సిందే అని అది చిన్నారులపై తీవ్ర ప్రభావం ఉంటుందంటున్నారు. వీలైనంత మేరకు చిన్నపిల్లల నుంచి మొబైల్స్ ను దూరం పెట్టాలని సూచిస్తున్నారు. గాడ్జెట్స్ ఉపయోగించే చిన్నారుల విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిందే అని చెబుతున్నారు. ఒకవేళ సమస్య వస్తే.. దానికి తగ్గట్టు ఎక్సర్ సైజులు చేయాలని.. అవసరమైతే ఫిజియోథెరపిస్టును సంప్రదించాలని సూచిస్తున్నారు.

Next Story