Top
logo

కేసీఆర్‌ కుటుంబంలో విషాదం

కేసీఆర్‌ కుటుంబంలో విషాదం
X
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుటుంబంలో విషాదం నెలకొంది. అనారోగ్యంతో కేసీఆర్ రెండో అక్క విమలా ...

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుటుంబంలో విషాదం నెలకొంది. అనారోగ్యంతో కేసీఆర్ రెండో అక్క విమలా బాయి (82) ఈ రోజు ఉద‌యం క‌న్నుమూశారు. ఆమె హైదరాబాద్‌ అల్వాల్‌లో మంగాపురం కాలనీలో నివసిస్తున్నారు. కొన్ని రోజులుగా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె అంత్య‌క్రియ‌ల‌ను అల్వాల్‌లో నిర్వ‌హించ‌నున్నారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. కాగా, సీఎం కేసీఆర్‌కు తొమ్మిది మంది సోద‌రీమ‌ణులు, ఒక సోద‌రుడు ఉన్నారు. సోదరి విమలాబాయి పార్థివదేహానికి సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్, ఎంపీ కవితతో పాటు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.

Next Story