Top
logo

రైతులపై కేసీఆర్ వరాల జల్లు

రైతులపై కేసీఆర్ వరాల జల్లు
X
Highlights

రైతులపై గులాబీ బాస్ కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. రాష్ట్రంలో రైతే రాజు కావాలని ఆకాంక్షించిన కేసీఆర్..పాక్షిక ...

రైతులపై గులాబీ బాస్ కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. రాష్ట్రంలో రైతే రాజు కావాలని ఆకాంక్షించిన కేసీఆర్..పాక్షిక మేనిఫెస్టోలో పలు హామీలు ఇచ్చారు. టీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తే.. రైతులకు లక్ష వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. అలాగే ప్రస్తుతం రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి ఏడాదికి ఇస్తున్న 8వేల నగదును 10 వేలకు పెంచుతామన్నారు. రుణమాఫీ వల్ల 45.5 లక్షల మందికి పైగా లబ్ది పొందుతారన్న కేసీఆర్‌... రుణమాఫీ విషయంలో గతంలో మాదిరిగా సమస్యలు రాకుండా చూస్తామని చెప్పారు. మరోవైపు 2021 జూన్ నాటికి తెలంగాణలో ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయని అప్పటి నుంచి కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు.

Next Story