కేసీఆర్ కిట్ల పథకంలో అవినీతి

x
Highlights

ప్రభుత్వాస్పత్రులో పురుడు పోసుకున్న మాతృమూర్తులకు అమ్మఒడి పథకం కింద దక్కాల్సిన కేసీఆర్‌ కిట్ల పథకంలో అవినీతి చోటుచేసుకుంటోంది. ప్రభుత్వ ఆస్పత్రులో...

ప్రభుత్వాస్పత్రులో పురుడు పోసుకున్న మాతృమూర్తులకు అమ్మఒడి పథకం కింద దక్కాల్సిన కేసీఆర్‌ కిట్ల పథకంలో అవినీతి చోటుచేసుకుంటోంది. ప్రభుత్వ ఆస్పత్రులో ఆరోగ్య పరీక్షలు చేసుకొని, అక్కడే కాన్పు చేసుకున్న మహిళలకు విడతల వారీగా నగదు సాయం, కేసీఆర్‌ కిట్లను అందిస్తున్నారు. అయితే హైదరాబాద్ హైకోర్టు సమీపంలోని జర్జిఖాన్ మెటర్నిటి ఆస్పత్రిలో.. కేసీఆర్ కిట్లను పొందిన వారి దగ్గర నుంచి 100 నుంచి 300 వందల వరకూ వసూలు చేస్తున్నారు.. కిట్లు ఇవ్వాల్సి ఉన్నా 20 రోజులుగా బాలింతలను రేపు, మాపు అంటూ తిప్పుతున్నారు. ఇదేంటని ప్రశ్నించేందుకు వెళ్లిన హెచ్ఎంటీవీపై ఆస్పత్రి సిబ్బంది దౌర్జన్యానికి దిగారు.

Show Full Article
Print Article
Next Story
More Stories