ఉప ప్రధానిగా కేసీఆర్?

ఉప ప్రధానిగా కేసీఆర్?
x
Highlights

రాజకీయాల్లో ఎవరిని కదిలించినా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రతిపాదన గురించే మాట్లాడుతున్నారు. దేశంలో కొత్త రాజకీయ వేదిక ఏర్పాటుకు...

రాజకీయాల్లో ఎవరిని కదిలించినా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రతిపాదన గురించే మాట్లాడుతున్నారు. దేశంలో కొత్త రాజకీయ వేదిక ఏర్పాటుకు ప్రయత్నిస్తానంటున్న ఆయన ఆలోచనను.. ఎక్కువ మంది సమర్థిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులైతే.. ఈ విషయంలో ఎక్కువగా విమర్శలు కూడా చేయలేక ఇబ్బంది పడుతున్న మాట ఒకంత వాస్తవం. దీంతో.. సినిమా నటుడు సుమన్ లాంటి వాళ్లు కూడా.. ఈ విషయంపై అభిప్రాయాలు చెబుతున్నారు.

రైతులకు ఉచితంగా 24 గంటల పాటు కరెంటు ఇవ్వడం మంచి పథకమన్న సుమన్.. కేంద్రం దక్షిణాదిని చిన్న చూపు చూస్తోందని చెప్పారు. కేంద్ర కేబినెట్ లో.. దక్షిణ భారత రాష్ట్రాల నాయకులకు ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్తరాదికి చెందిన మోడీ ప్రధానిగా ఉన్నపుడు.. దక్షిణ భారతానికి చెందిన నేతకు ఉప ప్రధాని పదవి ఇవ్వడం సమంజసం అన్నారు.

ఓవైపు కేసీఆర్ పనితీరును ప్రశంసిస్తూ.. మరోవైపు దక్షిణ భారత రాష్ట్రాల్లోని నేతకు ఉప ప్రధాని ఇవ్వాలని సుమన్ నర్మగర్భ వ్యాఖ్యలు చేయడంపై కొత్త చర్చ మొదలైంది. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తానని కేసీఆర్ చెప్పిన మరునాడే సుమన్ ఇలా అనడంతో.. ఆయన కేసీఆర్ కే ఉప ప్రధాని పదవి ఇస్తే ఇష్యూ సాల్వ్ అని ఇన్ డైరెక్ట్ గా చెప్పారేమో అని కూడా కొందరంటున్నారు.

ఏమో.. ఎవరికి తెలుసు.. రోజులు గడిస్తే.. కావాల్సిన క్లారిటీని.. రాజకీయ పరిణామాలే చెప్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories