నాగబాబుకి కత్తిమహేష్ సీరియస్ వార్నింగ్...మీ ఫ్యామిలీ గురించి నేను మాట్లాడితే తట్టుకోలేరు

సినీ విమర్శకుడు కత్తి మహేశ్ శ్రీ రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి కేసులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే...
సినీ విమర్శకుడు కత్తి మహేశ్ శ్రీ రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి కేసులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే కత్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేశారు. వారిలో మెగా బ్రదర్ నాగబాబు ఒకరు. దీంతో నాగబాబు, మెగా ఫ్యామిలీపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో కత్తి మహేశ్ ఓ వీడియో పోస్ట్ చేశారు. తన ఫేస్ బుక్ ఖాతాలో ఈ మేరకు ఓ వీడియోను పోస్టు చేసిన కత్తి, నాగబాబును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించాడు. తన పేరు చెప్పకుండా, తనను నీచుడిగా సంబోధించిన వీడియోను తాను చూశానని, దాన్ని చూసిన తరువాత తనకు జాలి కలిగిందని అన్నాడు. తాను ఎందుకు నీచుడినో చెప్పాలని ప్రశ్నించాడు. తమ్ముడికి అన్నగా తప్ప, మరే విధమైన అస్థిత్వం లేని వ్యక్తి తన గురించి మాట్లాడుతున్నారని ఆరోపించారు.
మీ కుటుంబం ఏమైనా రామ భక్తులా? అని ప్రశ్నించిన కత్తి, ప్రజలను మోసం చేస్తూ, ఉన్న పార్టీలను అమ్ముకుని వేరే పార్టీలో చేరడం, 'జబర్దస్త్'లో కూర్చుని పిచ్చి నవ్వులు నవ్వడమే సమాజానికి మీరు చేస్తున్న సేవని నిప్పులు చెరిగాడు. మీ కుటుంబం, మీ సోదరుల గురించి తాను మాట్లాడితే తట్టుకోవడం కష్టమని హెచ్చరిస్తూ, తాను చావడానికి సిద్ధమని, అయితే తనపై ఏదైనా చెయ్యి పడితే దానికి బాధ్యత మీదేనని అన్నాడు. తాను చేసిన వ్యాఖ్యలను అర్థం చేసుకోకుండా వార్నింగ్ ఇస్తున్నారని ఆరోపించిన కత్తి, మీ రాజకీయ, సినిమా జీవితాలు ఎంత దౌర్భాగ్యమో అందరికీ తెలిసే రోజు వస్తుందని, మీ పతనానికి మీరే పునాదులను తవ్వుకుంటున్నారని అన్నాడు. ఓ దళితుడిని నీచుడని సంబోధించారంటే, ఎంతో అహకారం ఉండి వుండాలని, సెక్యులర్ హిందువు ఎక్కడి నుంచి వచ్చారని కత్తి ప్రశ్నించాడు. దళితులపై, ముస్లింలపై దాడులు జరిగినప్పుడు ఏం చేస్తున్నారని దుయ్యబట్టాడు.
ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్‌తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
Cyber Crime: అంతకంతకూ పెరుగుతున్న సైబర్ నేరాలు
20 May 2022 3:45 AM GMTఇబ్బందుల్లో పడ్డ అఖిల్ ఏజెంట్ సినిమా
20 May 2022 3:21 AM GMTHyderabad: జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులను వేధిస్తున్న జీతం కట్ సమస్య
20 May 2022 2:47 AM GMTవిశాఖ స్టీల్ ప్లాంట్ భూముల లెక్కలపై అయోమయం
20 May 2022 2:27 AM GMTCM Jagan: నేటి నుంచి సీఎం జగన్ విదేశీ పర్యటన
20 May 2022 2:16 AM GMT