'అజ్ఞాతవాసిపై' కత్తి మహేష్ ట్వీట్

x
Highlights

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్‌లో ‘అజ్ఞాతవాసి’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక పవన్ మూవీ వస్తుందంటే కలెక్షన్స్ సునామీ...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్‌లో ‘అజ్ఞాతవాసి’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక పవన్ మూవీ వస్తుందంటే కలెక్షన్స్ సునామీ మొదలు కాబోతుందని ఫిక్స్ అయిపోతుంటారు ఆయన ఫ్యాన్స్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మూవీ వస్తుందంటే ప్రేక్షకుల అంచనాలు భారీగానే ఉంటాయి. ఈ అంచనాలకు తగ్గట్లు గానే ‘అజ్ఞాతవాసి’ చిత్రం ఉందంటూ ఓవర్సీస్ నుండి టాక్ వినిపిస్తుంది. సినిమా సూపర్ హిట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ ఈ సినిమాపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. సీరియస్ గా ఉన్న కథకి కామెడీ కథనంతో చికాకుపెట్టారని మషేష్ అన్నారు. సినిమాను అపహాస్యం చేసిన చిత్రం 'అజ్ఞాతవాసి' అని తెలిపారు. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అత్యంత దారుణమైన సినిమా ఇది అంటూ విమర్శించారు. 'రిస్క్ చేసి చూస్తే... టైమేమో...' (ఈ సినిమాలో ఓ పాట ఈ ట్యూన్ లో ఉంది) అంటూ కామెంట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories