పవన్ ను.. కత్తి వదిలేశాడు!

పవన్ ను.. కత్తి వదిలేశాడు!
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై.. విమర్శకుడు కత్తి మహేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హోదాకన్నా ప్యాకేజీ మిన్న అని జనాన్ని నమ్మబలికిన...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై.. విమర్శకుడు కత్తి మహేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హోదాకన్నా ప్యాకేజీ మిన్న అని జనాన్ని నమ్మబలికిన చంద్రబాబు.. ఇప్పుడు అదే జనానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు తీరుతో నాలుగేళ్లుగా ఆంధ్రా ప్రజలు.. తమ హక్కులను కోల్పోతున్నారని కూడా కామెంట్ చేశారు.

కట్టుబానిస, పలాయనవాదం లాంటి పదాల్ని వాడడం కూడా సరికాదని ట్విటర్ వేదికగా కామెంట్ చేశారు. కేంద్రం నుంచి టీడీపీ ప్రభుత్వం విడిపోయిన సందర్భంపైనే… ప్రత్యేక హోదా, నిధుల కేటాయింపు విషయంలో ఏ హామీ తేల్చకుండా.. కేంద్రం నాన్చుతున్న వైఖరిపైనే.. కత్తి మహేష్ విమర్శలు చేశారు. రెండు ప్రభుత్వాల తీరును నర్మగర్భంగా తప్పుబడుతూ.. ప్రశ్నలు సంధించారు.

మామూలుగా.. పవన్ కల్యాణ్ పై అంతెత్తున లేచే కత్తి మహేష్.. ఈ వ్యవహారంలో మాత్రం ఆయన పేరు ప్రస్తావించనే లేదు. దీంతో.. కత్తి కామెంట్లను ఎంజాయ్ చేసేవాళ్లంతా.. ఇప్పుడు ఉసూరుమంటున్నారు. హోదా విషయంలో పవన్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్న కారణంగానే.. ఎందుకొచ్చిన తలనొప్పి అనుకున్నాడేమో.. కత్తి మహేష్ ఆయన గురించి టచ్ చేసి ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories