logo
సినిమా

బిగ్ బాస్ 2 పై కత్తి కార్తీక సంచలన వ్యాఖ్యలు!

బిగ్ బాస్ 2 పై కత్తి కార్తీక సంచలన వ్యాఖ్యలు!
X
Highlights

టాలీవుడ్ హీరో, నేచురల్ స్టార్ నాని ప్రధాన వ్యాఖ్యాతగా 'బిగ్‌ బాస్-2' రియాల్టీ షో గత ఆదివారం నుంచి...

టాలీవుడ్ హీరో, నేచురల్ స్టార్ నాని ప్రధాన వ్యాఖ్యాతగా 'బిగ్‌ బాస్-2' రియాల్టీ షో గత ఆదివారం నుంచి ప్రారంభమైంది. ఈ రెండో సీజన్ షోపై పలువురు పలు రకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. తాజాగా బిగ్ బాస్-1లో ఓ కంటెస్టెంట్‌గా ఉన్న కత్తి కార్తీక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్-2 రియాల్టీ షో గురించి 'ఇంకొంచెం మసాలా' అని చెప్పారని... మసాలా ఉందేమో కానీ, ఫ్లేవర్ మాత్రం మిస్ అయిందని కత్తి కార్తీక సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్-1లో కంటెస్టెంట్ అయిన కార్తీక తన తెలంగాణ యాసలో యాంకర్ గా జనాలను అలరించిన సంగతి తెలిసిందే. తెలంగాణకు చెందిన ఒక్క కంటెస్టెంట్ ను అయినా పెట్టి ఉంటే బాగుండేదని చెప్పింది. సీజన్-1లో ముగ్గురు తెలంగాణ వాళ్లను పెట్టారని... ఈ సీజన్ లో కూడా అది కొనసాగి ఉంటే బాగుండేదని తెలిపింది. ఈ విషయంలో తాను కొంచెం నిరాశకు గురయ్యానని చెప్పింది. ఒకప్పుడు తాను యాంకర్ గా ఉన్న సమయంలో కేవలం తెలంగాణ ప్రజలకు మాత్రమే తెలుసునని..కానీ బిగ్ బాస్ పుణ్యమా అని ఇరు రాష్ట్ర ప్రజలు తనను బాగా గుర్తించారని చెప్పింది.

Next Story