logo
సినిమా

క్రికెటర్‌గా నానికి - తోడుగా కశ్మీరా పరదేశీ

క్రికెటర్‌గా నానికి - తోడుగా కశ్మీరా పరదేశీ
X
Highlights

నాగార్జునతో కలసి దేవదాస్ సినిమా పనుల్లో ఫుల్ బిజీగా ఉన్న నాచురల్ స్టార్ నాని మరో సినిమాకు అప్పుడే సైన్...

నాగార్జునతో కలసి దేవదాస్ సినిమా పనుల్లో ఫుల్ బిజీగా ఉన్న నాచురల్ స్టార్ నాని మరో సినిమాకు అప్పుడే సైన్ చేసేశాడు.గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఒక సినిమాకు నాని ఒప్పుకున్నట్టు ఫిల్మ్ వర్గాల టాక్. క్రీడా నేపథ్యం ఉన్న ఈ సినిమా కథకు నాని ఫ్లాట్ అయి వెంటనే ఓకే చేసినట్టు తెలుస్తుంది.గతంలో కూడా నాని క్రీడా నేపథ్యంతో ఒక సినిమా (భీమిలీ కబడ్డి జట్టు) తో సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.

ట్రేడ్ వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం ఇందులో నాని క్రికేటర్ గా నటిస్తుండగా,నాని సరసనా నర్తనశాల ఫేం హిరోయిన్ కశ్మీరా పరదేశీ నటించనుంది.క్రికెటర్ అర్జున్ గా నాని ప్రేక్షకులను అలరిస్తాడని,జెర్సీ పేరుతో సినిమా టైటిల్ కూడా కన్‌ఫమ్‌ అయినట్టు తెలుస్తుంది.ఇప్పటికే సూత్రప్రాయంగా మొదలయి ఈ సినిమా అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్‍కు జరగనుంది.

Next Story