logo
జాతీయం

కరుణానిధిని కడసారి చూసేందుకు వెళ్లి ఇద్దరి మృతి

కరుణానిధిని కడసారి చూసేందుకు వెళ్లి ఇద్దరి మృతి
X
Highlights

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని కడసారి చూసేందుకు తమిళనాడు నలుమూలల నుంచి అభిమానులు, డీఎంకే కార్యకర్తలు...

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని కడసారి చూసేందుకు తమిళనాడు నలుమూలల నుంచి అభిమానులు, డీఎంకే కార్యకర్తలు భారీగా తరలిరావడంతో రాజాజీ హాల్ దగ్గర పరిస్థితి అదుపు తప్పింది. ఉదయం నుంచి సంయమనంగా ఉన్న అభిమానులు.. మధ్యాహ్నానికి సంయమనం కోల్పోయారు. కరుణకు నివాళులర్పించేందుకు వివిధ రంగాల ప్రముఖులు చాలా మంది రావడంతో సామాన్యులకు దివంగత నేతను చూసే అవకాశం రాలేదు. దీంతో కరుణను దగ్గరగా చూడాలని అభిమానులు చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. కొందరు బారికేడ్లు దాటుకుని కరుణ పార్థివదేహం వద్దకు వెళ్లేందుకు ముందుకు దూసుకెళ్ళారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. 40 మంది గాయపడ్డారు.

Next Story