కరుణాధి పుట్టుకతోనే పోరాట యోధుడు

కరుణాధి పుట్టుకతోనే పోరాట యోధుడు
x
Highlights

కరుణానిధి పుట్టుకతోనే పోరాటయోధుడన్నారు కేరళ సీఎం పినరయి విజయన్. అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి...

కరుణానిధి పుట్టుకతోనే పోరాటయోధుడన్నారు కేరళ సీఎం పినరయి విజయన్. అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని ఆయన గురువవారం పరామర్శించారు. ఉదయం చెన్నైలోని కావేరి హాస్పిటల్ కు చేరుకున్న ఆయన... కరుణానిధి ఆరోగ్య పరిస్థితి గురించి స్టాలిన్, కనిమొళిని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ...కరుణానిధి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందన్నారు. జీవింలో ఎన్నో అంశాలపై కరుణ పోరాడారని పేర్కొన్న విజయన్.. ఆయన సంకల్పశక్తి చాలా గొప్పదన్నారు. కరుణానిధి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. గత నెల 27న ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. కరుణానిధిని ఆస్పత్రికి తరలించారు. రక్తపోటు పడిపోవడంతో గత శుక్రవారం నుంచి ఆయన కావేరి ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న చాలామంది రాజకీయ, సినీ ప్రముఖులు ఆస్పత్రికి వచ్చి కరుణానిధిని పరామర్శిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories