అభిమాని మరణంతో కన్నీరు పెట్టుకున్న కార్తీ

అభిమాని మరణంతో కన్నీరు పెట్టుకున్న కార్తీ
x
Highlights

తమిళ నటుడు సూర్య తమ్ముడు కార్తీ తమిళంలోనే కాదు తెలుగులోను పాపులర్. సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయం అయినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని...

తమిళ నటుడు సూర్య తమ్ముడు కార్తీ తమిళంలోనే కాదు తెలుగులోను పాపులర్. సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయం అయినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని సత్తా చాటాడు కార్తీ. అంతేకాదు అభిమానులను తరుచూ కలుస్తూ వారికి సాయం చేస్తూ తన పెద్ద మనసును చాటుకున్న కార్తీ, ఓ అభిమాని మృతితో కన్నీరు పెట్టుకున్నాడు. తిరువన్నామలై కార్తీ ఫ్యాన్స్ అసోసియేషన్ సెక్రటరీ జీవన్ కుమార్ నిన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన కార్తీ వెంటనే జీవన్ ఇంటికి వెళ్ళి తన నివాళులు అర్పించాడు. అభిమాని మృతిని ఏ మాత్రం తట్టుకోలేకపోయాడు కార్తీ.

Show Full Article
Print Article
Next Story
More Stories