సెల్ఫీకి ప్రయత్నించిన అభిమాని.. లాగి కొట్టిన మంత్రి

తమ అభిమాన సినీ నటులు, రాజకీయ నాయకులు కనపడితే చాలు వారితో సెల్ఫీలు దిగాలని తెగ ఆరాటపడిపోతుంటారు అభిమానులు....
తమ అభిమాన సినీ నటులు, రాజకీయ నాయకులు కనపడితే చాలు వారితో సెల్ఫీలు దిగాలని తెగ ఆరాటపడిపోతుంటారు అభిమానులు. అయితే, ఒక్కోసారి అభిమానుల ప్రవర్తన చికాకు పుట్టిస్తుంది. ఇటువంటి అనుభవమే కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే శివకుమార్‌కి ఎదురైంది. కర్నాటక ఇందనశాఖ మంత్రి శివకుమార్ సెల్ఫీకి ప్రయత్నించిన అభిమానిని లాగిపెట్టి కొట్టారు. ఈ ఘటన బళ్లారిలో జరిగింది. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన శివకుమార్‌తో సెల్ఫీ దిగేందుకు కొందరు అభిమానులు ప్రయత్నించారు. ఓ వ్యక్తి ఆయన సమీపంలోకి వచ్చి స్వీయ చిత్రం తీసేందుకు ప్రయత్నించాడు. దాంతో మంత్రి సహనం కొల్పోయారు. వెంటనే చేయి చేసుకున్నారు. మంత్రి చేయి బలంగా తగలడంతో అభిమాని చేతిలో ఉన్న ఫోన్ చాలా దూరం ఎగిరిపడింది. ఇదేమి పట్టించుకోకుండా మంత్రి తనదారిన తాను వెళ్లిపోయారు. ఈ వీడియో మీడియాకు చిక్కడంతో వైరల్ అయింది. ఇదేమి పెద్ద విషయం కాదని శివకుమార్ తన చర్యలను సమర్ధించుకున్నారు. తన విధి నిర్వాహణకు అభిమాని అడ్డురావడంతో అలా జరిగిందని బదులిచ్చారు.
Bandi Sanjay: డీజీపీకి డెడ్‌లైన్ విధించిన బండి సంజయ్
15 Aug 2022 9:19 AM GMTతెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన కే.కేశవరావు
15 Aug 2022 8:15 AM GMTగోల్కొండ కోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
15 Aug 2022 6:33 AM GMTచిరంజీవి బ్లడ్ బ్యాంకులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 6:17 AM GMTమంగళగిరిలోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 4:49 AM GMT75th Independence Day: తెలంగాణలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 2:52 AM GMTFreedom Rally: పోలీసుల తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
13 Aug 2022 10:37 AM GMT
ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం
16 Aug 2022 3:09 AM GMTనేడు అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ పర్యటన .. ఏటీసీ టైర్స్ ప్రారంభం
16 Aug 2022 2:28 AM GMTWeather Report: తెలంగాణకు భారీ వర్ష సూచన
16 Aug 2022 1:55 AM GMTఇవాళ వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్న సీఎం కేసీఆర్
16 Aug 2022 1:35 AM GMTచాలాకాలం తర్వాత ఒకే కార్యక్రమానికి జగన్, చంద్రబాబు
16 Aug 2022 1:07 AM GMT