కాంగ్రెస్ లో తీవ్ర విషాదం.. ఎమ్మెల్యే దుర్మరణం!

nanireddy
Updated on: 24 Dec 2018 1:33 PM IST
కాంగ్రెస్ లో తీవ్ర విషాదం.. ఎమ్మెల్యే దుర్మరణం!
X

కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది.. రోడ్డు ప్రమాదంలో ఆ పార్టీ ఎమ్మెల్యే దుర్మరణం పాలయ్యారు. సదరు ఎమ్మెల్యే కారును ఓ లారీ ఢికొట్టడంతో తీవ్ర గాయాలతో ఆయన దుర్మరణం చెందారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నాయకుడు, జంఖండి ఎమ్మెల్యే సిద్దు భీమప్ప న్యామగౌడ్‌ గోవా నుంచి బాగల్‌కోట్‌కు రోడ్డు మార్గం గుండా వస్తోన్న సమయంలో ఎదురుగా వస్తున్నలారీ అదుపుతప్పి ఎమ్మెల్యే కారును ఢీకొట్టింది. దీంతో కారులో ఎమ్మెల్యే సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఎమ్మెల్యే సిద్దు భీమప్ప న్యామగౌడ్‌ మృతిచెందారు.. ఆయన మృతి చెందారన్న వార్త కాంగ్రెస్ పార్టీని షాక్ కు గురిచేసింది.. జంఖండి నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి గెలుపొందిన భీమప్పకు ఈ సారి మంత్రి పదవి దక్కడం ఖాయమని ప్రచారం జరుగుతోన్నవేళ ఆయన మరణవార్త పలువురిని దిగ్భ్రాంతికి గురిచేసింది.

nanireddy

nanireddy

Next Story