logo
జాతీయం

ఇద్దరు చంద్రుళ్లు చెప్పినట్లే చేశానన్న సీఎం

ఇద్దరు చంద్రుళ్లు చెప్పినట్లే చేశానన్న సీఎం
X
Highlights

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌...

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌ సలహాతోనే....కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నట్లు వెల్లడించారు. కమలం పార్టీ కంటే కాంగ్రెస్‌ పార్టీతో వెళ్లడమే మంచిదని చాలా మంది సీఎంలు, పార్టీ నేతలు తనకు సలహా ఇచ్చారని కుమారస్వామి తెలిపారు. చదువుల్లో ఎప్పుడూ మొద్దేనన్న కర్ణాటక సీఎం...బాగా చదువుంటే సివిల్స్‌ సర్వీస్‌లోకి వెళ్లి ఉండి వాడినన్నారు.

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి....ముఖ్యమంత్రి పదవి ఎలా చేపట్టారో వెల్లడించారు. చదువుల్లో మొద్దు అన్న కుమారస్వామి....ఎప్పుడూ బ్యాక్‌ బెంచ్‌ స్టూడెంటేనన్నారు. ఓ ఇంగ్లీష్‌ పత్రికకు ఇచ్చిన పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌ సలహాతోనే...కాంగ్రెస్‌ పొత్తుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశానన్నారు. పశ్చిమ బంగా సీఎం మమతా బెనర్జీ సైతం...కాంగ్రెస్‌తో కలిసి వెళ్లాలని సూచించినట్లు కుమారస్వామి చెప్పారు. కాంగ్రెస్‌తో అవగాహనకు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సలహా ఇచ్చినట్లు తెలిపారు.

2006లో బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశానన్న ఆయన.... బీజేపీతో కలవడం తన తండ్రి దేవెగౌడకు ఏ మాత్రం ఇష్టం లేదని కుమారస్వామి తెలిపారు. ఏళ్ల తరబడి ఆయన సంపాదించుకున్న సెక్యులర్‌ ఇమేజీ నా వల్ల దెబ్బతిందన్నారు. తన నిర్ణయంతో తండ్రి ఆరోగ్యం క్షీణించిపోయిందని కుమారస్వామి గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీతో జేడీఎస్‌ ఉనికికి ఏ మాత్రం ఢోకా ఉండబోదని ధీమా వ్యక్తం చేశారు.

ముందు బెంచ్‌లో కూర్చుంటే టీచర్లు ప్రశ్నలు అడుగుతారని భయంతో....ఎప్పుడూ వెనక బెంచ్‌లో కూర్చునేవాడినన్న కుమారస్వామి తెలిపారు. రాజ్‌కుమార్‌కు వీరాభిమానినన్న కర్ణాటక సీఎం.... ఆయన సినిమాలు తప్పకుండా చూసేవాడినని తెలిపారు. బాగా చదివి ఉంటే ఐఏఎస్‌ అయ్యేవాడినని....తాను ఎందుకూ పనికిరానని తండ్రి దేవెగౌడ ఎప్పుడూ తిడుతుండేవారని గుర్తు చేసుకున్నారు.

Next Story