కార్గిల్ యుద్ధ వీరుడి కుటుంబం దీనగాథ

x
Highlights

కార్గిల్ యుద్ధం 1996లో జరిగింది. పాక్ సైనికులు, టెర్రిరస్టు మూకలను భారత సైన్యం చిత్తు చేసింది. ఎముకల కొరికే చలిలో పోరాడిన సైనికుల వీర గాథలు...

కార్గిల్ యుద్ధం 1996లో జరిగింది. పాక్ సైనికులు, టెర్రిరస్టు మూకలను భారత సైన్యం చిత్తు చేసింది. ఎముకల కొరికే చలిలో పోరాడిన సైనికుల వీర గాథలు దేశవ్యాప్తంగా గొప్పగా చెప్పుకున్నారు. అమర వీరులకు అండగా ఉంటామని ప్రభుత్వాలు హామీ ఇచ్చాయి. ఒకటి కాదు రెండు కాదు 22 ఏళ్లుగా సర్కార్ ఇచ్చిన హామీలు హామీలుగానే మిగిలిపోయాయి. రేపు కార్గిల్ దివాస్ సందర్భంగా సంగారెడ్డికి చెందిన ఓ యుద్ధ వీరుడి కుటుంబ దీనగాథపై స్పెషల్ స్టోరీ.

సైనిక దుస్తుల్లో ఉన్న ఈ యువకుడి పేరు విజయ్ కుమార్. సంగారెడ్డికి చెందిన ఇతను 1992లో బీఎస్ ఎఫ్ లో చేరారు. రాజస్థాన్, కశ్మీర్ ల్లో విధులు నిర్వహించారు. 1996లో జరిగిన కార్గిల్ యుద్ధంలో జవాన్ విజయ్ పాల్గొన్నాడు. బారాముల్లా జిల్లా సోపూర్ లో పాక్ సైనికులు, టెర్రరిస్టులకు భారత సైన్యం మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో పదులు సంఖ్యల్లో ఉగ్రవాదులు మృతి చెందారు. మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో జవాన్ విజయ్ వీర మరణం పొందాడు.

కశ్మీర్ నుంచి ప్రత్యేక సైనిక విమనంలో విజయ్ మృతదేహాన్ని సంగారెడ్డికి తీసుకువచ్చారు. కుటుంబ సభ్యులకు డెడ్ బాడీని అధికారులు అందజేశారు. విజయ్ అంతిమయాత్రలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తో పాటు వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. అమరవీరుడికి ఘన నివాళి అర్పించారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు బలి ఇచ్చిన విజయ్ కుటుంబానికి అండగా ఉంటామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చింది. కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటు ఇంటి స్థలం ఇస్తామని భరోసా ఇచ్చింది. ఇంటి స్థలం కేటాయిస్తు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

కార్గిల్ యుద్ధం జరిగి 22 ఏళ్లు గడిచాయి. వీర జవాన్ విజయ్ కుటుంబానికి సర్కార్ ఇచ్చిన హామీ హామీలాగానే మిగిలిపోయింది. అధికారులు, ప్రజాప్రతినిధులు చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయారు విజయ్ తల్లి, అతడి సోదరుడు. విజయ్ తల్లి అనసూయ వయసు 90 ఏళ్లు. నడవలేనిలేని స్థితిలో ఉంది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన తన కొడుకు విజయ్ ఫోటో రోజూ చూస్తూ కుమిలిపోతుంది. వీర సైనికుల గురించి అందరూ గొప్పగా మాట్లాడుతారని, సాయం మాత్రం చేయరని వాపోతుంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా తమకు న్యాయం జరగడంలేదని విజయ్ సోదరుడు సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకోవాలని కోరుతున్నాడు. తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతున్నాడు. ఏటా జూలై 26న ప్రభుత్వం కార్గిల్ దివాస్ నిర్వహిస్తోంది. అమరవీరులకు ఘన నివాళి అర్పిస్తారు. ఈ కార్గిల్ దివాస్ లోనైనా 22 ఏళ్ల క్రితం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వీర జవాన్ విజయ్ కుటుంబం వేడుకుంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories