ఐ లవ్యూ రాహుల్ గాంధీ : కరీనా
బాలీవుడ్ స్టార్ కథానాయిక కరీనా కపూర్ ఖాన్‌కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అంటే ఇష్టమట. అంతే...
బాలీవుడ్ స్టార్ కథానాయిక కరీనా కపూర్ ఖాన్‌కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అంటే ఇష్టమట. అంతే కాదండోయ్.. అతని గురించి తెలుసుకోవాలని ఉందని, రాహుల్‌తో మాట్లాడడానికి కూడా తనకు అభ్యంతరం లేదని చెప్పింది. ముంబయిలో వారం రోజులుగా జరుగుతున్న లాక్మే ఫ్యాషన్ షోలో కరీనా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2002లో కరీనా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందుకంటే.. ఆ ఇంటర్వ్యూలో తనకు రాహుల్ గాంధీ అంటే ఇష్టమంటూ చెప్పింది కరీనా.
అప్పటికి కరీనాకు ఇప్పుడున్నంత గుర్తింపు లేదు. ఆ సమయంలో ఓ ఇంటర్వ్యూలో ప్రేమించడం గురించి మాట్లాడుతూ..సరైన సమయం వచ్చినప్పుడు ప్రేమలో పడతాను. నాకు తారసపడే వ్యక్తి ఆలోచనా విధానం కూడా నాలాగే ఉండాలి. అలాంటి వ్యక్తినే ప్రేమిస్తాను’ అని చెప్పింది. అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని అడిగితే..ఈ విషయం చెప్పొచ్చో లేదో తెలీదు కానీ.. రాహుల్ గాంధీ అంటే ఇష్టం. అతని గురించి చాలా తెలుసుకోవాలని ఉంది. అతని ఫొటోలు పేపర్లలో చూస్తూ ఉంటాను. అతనితో మాట్లాడటానికి కూడా నాకు ఇబ్బంది లేదు. నాది సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం. రాహుల్‌ది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. మా ఇద్దరి విషయాలు ఆసక్తికరంగా ఉంటాయని నా అభిప్రాయం’ అని కరీనా వెల్లడించింది. అప్పుడెప్పుడో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. కరీనా ప్రస్తుతం ‘వీరే ది వెడ్డింద్’ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఫ్లెక్సీ వార్.. కేసీఆర్ ఫ్లెక్సీలపై మోడీ ఫ్లెక్సీలు!
2 July 2022 1:30 PM GMTటీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్.. రూ. 96.21 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ..
2 July 2022 12:57 PM GMTమోడీకి అనేక ప్రశ్నలు సంధించిన కేసీఆర్.. రేపటి బహిరంగ సభలో జవాబులివ్వాలని సవాల్..
2 July 2022 12:30 PM GMTమోడీ భాగ్యలక్ష్మిని దర్శించుకుంటారా?
2 July 2022 11:48 AM GMTTalasani Srinivas Yadav: బీజేపీ సిద్ధమైతే.. అందుకు మేమూ రెడీ..
2 July 2022 11:15 AM GMTవయనాడ్ ఆఫీసు ధ్వంసాన్ని లైట్ తీసుకున్న రాహుల్
1 July 2022 12:30 PM GMT'ఆవో-దేఖో-సీకో'.. ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ
1 July 2022 12:15 PM GMT
బీజేపీ సభ కోసం పరేడ్ గ్రౌండ్‌కు వచ్చిన గద్దర్..
3 July 2022 11:26 AM GMTBandi Sanjay: ఒక్క కుటుంబం చేతుల్లో తెలంగాణ నలిగిపోతోంది
3 July 2022 11:00 AM GMTPiyush Goyal: కాళేశ్వరం ప్రాజెక్టులో విపరీతమైన అవినీతి
3 July 2022 10:49 AM GMTTelangana: ఖరీఫ్ సీజన్లో పత్తి, మిర్చి సాగుపై రైతుల ఆసక్తి
3 July 2022 10:45 AM GMTకాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో నష్టపోతున్న రైతులు
3 July 2022 10:22 AM GMT