logo
సినిమా

బాలీవుడ్ నటుడు కరణ్ జొహార్ ను కిడ్నాపర్ల నుంచి కాపాడిన రానా!

X
Highlights

ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత, నటుడు కరణ్ జొహార్ ను కిడ్నాపర్ల బారి నుంచి హీరో రానా కాపాడాడు. అయితే ఇది నిజ...

ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత, నటుడు కరణ్ జొహార్ ను కిడ్నాపర్ల బారి నుంచి హీరో రానా కాపాడాడు. అయితే ఇది నిజ జీవితంలో కాదు. 'వెల్ కం టు న్యూయార్క్' అనే బాలీవుడ్ సినిమాలో. రానా, కరణ్ జొహార్, సొనాక్షి సిన్హా, రితీష్ దేశ్ ముఖ్, బొమన్ ఇరానీ, లారా దత్తా, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ లు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇండియాకు చెందిన తొలి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ మూవీ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. న్యూయార్క్‌లో జరుగుతున్న ఓ ఈవెంట్‌కు అంతా వెళ్తారు. అక్కడే కరణ్ కిడ్నాప్ అవగానే బాహుబలి అని అరుస్తారు. అప్పుడు రానా వెళ్లి రక్షిస్తాడు. ఈ సినిమాలో కరణ్ డ్యూయెల్ రోల్ పోషించాడు. ఈ సినిమా ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story