కేంద్రాన్ని ఇరుకున పెట్టేసిన బాబు..?

Highlights

ఎప్పటినుంచో నలుగుతున్న కాపు రిజర్వేషన్ లకు నిన్న కేబినెట్ తీర్మానం ఆమోదించి, నేడు అసెంబ్లీలో బిల్ ప్రవేశపెట్టి మోక్షం ప్రసాదించిన ముఖ్యమంత్రి...

ఎప్పటినుంచో నలుగుతున్న కాపు రిజర్వేషన్ లకు నిన్న కేబినెట్ తీర్మానం ఆమోదించి, నేడు అసెంబ్లీలో బిల్ ప్రవేశపెట్టి మోక్షం ప్రసాదించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆతరువాతి బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టినట్టు తెలుస్తోంది.. సుప్రీం కోర్ట్ విధించిన నిబంధనల ప్రకారం రిజర్వేషన్ లు 50 శాతానికి మించకూడదు.. ఒకవేళ మించిపోయినట్టయితే 9వ షెడ్యూల్ ప్రకారం ఆ నిర్ణయం కేంద్రానికి వదిలెయ్యాలి.. అయితే ఏపీలో ఇప్పటికే 50 శాతం రిజర్వేషన్ లు ఉండగా మరో 5 శాతం కాపులకు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది .. దీంతో మొత్తం కలిపి 55 శాతం అవుతుంది..

ఇదిలావుంటే నేడు ఏపీ అసెంబ్లీ లో దీనికి సంబంధించి తీర్మానాన్నిప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు.. నేడో లేదా రేపో కేంద్రం ఆమోదానికి పంపిస్తారు.. మరి కేంద్రప్రభుత్వం దీనిపై ఆమోదం తెలుపుతుందా..? అంటే సమాధానం చెప్పలేని ప్రశ్న.. బీజేపీ పాలిత ప్రాంతమైన గుజరాత్ లో పటేళ్ల రిజర్వేషన్ ల కోసం పోరాటం జరుగుతున్న తరుణంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారో లేదోనన్న అనుమానం కలుగుతుంది..

గుజరాత్ లో బీజేపీకి దెబ్బ..!

ఒకవేళ కాపు రిజర్వేషన్ల కు సంబంధించి 9 షెడ్యూల్ లో సవరణలు చేసినట్టయితే గుజరాత్ లో పటేళ్ల రిజర్వేషన్ ల కోసం పోరాటం ఉధృతం అయ్యే ప్రమాదం ఉంది.. ఇదే జరిగితే త్వరలో జరగబోయే ఎన్నికలకు బీజేపీ గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. పోనీ గుజరాత్ పటేళ్లకు రిజర్వేషన్ లు కల్పించే ప్రయత్నం చేస్తే, అప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాలు మాకు కావాలంటే మాకు కావాలని ఉద్యమాలు చేసే ప్రమాదం ఉంది.. తద్వారా బీజేపీకి దేశవ్యాప్తంగా వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు..

కావాలనే మోడీని ఇరుకున పెట్టేశారా..?

మొన్నటికి మొన్న పోలవరం నిర్మాణాన్ని తాత్కాలికంగా కేంద్ర ప్రభుత్వం ఆపేసింది.. దీంతో తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసారు సీఎం చంద్రబాబు.. అంతేకాదు ఒకానొకదశలో మీకో నమస్కారం ఈ ప్రాజెక్ట్ ను మీరే కట్టండని సంచలన వ్యాఖ్యలు చేసారు.. దీనికి కేంద్రం కూడా గట్టి సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది.. ఈ క్రమంలోనే కేంద్రాన్ని కాపు రిజర్వేషన్ ల నేపథ్యంలో ఇరుకున పెట్టేసి ఉంటారని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది..

Show Full Article
Print Article
Next Story
More Stories